Sankranthiki Vastunnam : ప్రముఖ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. సాధారణమైన అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ప్రాంతీయ బాషా చిత్రాల క్యాటగిరీలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. అయితే వారం రోజుల క్రితమే ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేయగా, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. టీవీ టెలికాస్ట్ జరిగిన రోజే, ఓటీటీ లో కూడా సినిమా అందుబాటులోకి వచ్చింది. టీఆర్ఫీ రేటింగ్స్ ఎంత వచ్చాయి అనేది ప్రస్తుతానికి ఇంకా వివరాలు బయటకు రాలేదు కానీ, ఓటీటీ లో మాత్రం సునామీని సృష్టించింది అనే చెప్పొచ్చు.
మొదటి రోజు కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, మొదటి వారం మొత్తం కలిపి 300 మిలియన్ల వాచ్ మినిట్స్ ని సొంతం చేసుకుందట. కేవెలం జీ 5 యాప్ లోనే కాదు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీ లివ్ ఇలా ఎన్ని ఓటీటీ చానెల్స్ ఉన్నాయో, అన్నిట్లో కూడా ఈ సినిమాకి వచ్చినన్ని ఫాస్టెస్ట్ వ్యూస్ ఏ సినిమాకు కూడా రాలేదట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రాబోయే రోజుల్లో ఈ చిత్రం 500 మిలియన్ వాచ్ మినిట్స్ ని కూడా కైవసం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ అయితే, ఓటీటీ లో డబుల్ సెన్సేషనల్ హిట్ గా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇకపోతే ఈ చిత్రంలోని ‘గోదారి గట్టు మీద’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఈ పాటని థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్లిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ కి యూట్యూబ్ లో 200 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఈ మైల్ స్టోన్ ని కూడా ఈ చిత్రం రీసెంట్ గానే దాటింది. అదే విధంగా సినిమా విడుదల తర్వాత కొన్నాళ్ళకు వీడియో సాంగ్ ని విడుదల చేస్తే, అది ఇప్పుడు 50 మిలియన్ వ్యూస్ కి అతి దగ్గరగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా థియేటర్స్ నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఇంకా ఎన్ని అద్భుతమైన రికార్డ్స్ ని నెలకొల్పతుందో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.