Homeఅంతర్జాతీయంTrump UFO Statement Latest: ఇన్ని రోజులు ట్రంప్ తెలివైనవాడు అనుకున్నాం.. దీంతో కన్ఫర్మ్ అయింది..

Trump UFO Statement Latest: ఇన్ని రోజులు ట్రంప్ తెలివైనవాడు అనుకున్నాం.. దీంతో కన్ఫర్మ్ అయింది..

Trump UFO Statement Latest: గొప్పగా ఆలోచిస్తాడు. అమెరికా కోసం పాటుపడతాడు . ప్రపంచ దేశాల మీద యుద్ధాలు చేస్తాడు. అమెరికాను మొదటి స్థానంలో ఉంచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అవసరమైతే ఇతర దేశాల మీద పన్నులు విధించడానికి కూడా వెనుకాడడు.. తమ దేశంలో ఉంటున్న విదేశీయులను బయటికి పంపియ్యడానికి కూడా ఏమాత్రం ఆలోచించడు.. ఇదంతా చదువుతుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్తుకొస్తున్నారు కదా.. డోనాల్డ్ ట్రంప్ ఏం చేసినా వింతగానే ఉంటుంది. అందులో […]

Trump UFO Statement Latest: గొప్పగా ఆలోచిస్తాడు. అమెరికా కోసం పాటుపడతాడు . ప్రపంచ దేశాల మీద యుద్ధాలు చేస్తాడు. అమెరికాను మొదటి స్థానంలో ఉంచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అవసరమైతే ఇతర దేశాల మీద పన్నులు విధించడానికి కూడా వెనుకాడడు.. తమ దేశంలో ఉంటున్న విదేశీయులను బయటికి పంపియ్యడానికి కూడా ఏమాత్రం ఆలోచించడు.. ఇదంతా చదువుతుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్తుకొస్తున్నారు కదా..

డోనాల్డ్ ట్రంప్ ఏం చేసినా వింతగానే ఉంటుంది. అందులో అమెరికా ప్రయోజనం దాగి ఉంటుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు.. అంతకంటే ముందు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. మనదేశంలో ట్రంప్ టవర్స్ పేరు మీద అతడు వ్యాపారం సాగిస్తున్నాడు. పూణే, హైదరాబాద్ నగరాలలో ట్రంప్ కు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. భారీగా భవనాలను ట్రంప్ కంపెనీ ఇక్కడ నిర్మిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ట్రంప్ కంపెనీ భారీ ఎత్తున టవర్స్ కూడా నిర్మిస్తోంది.

ట్రంప్ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. గంభీరత దర్శనమిస్తుంది. అప్పుడప్పుడు మూర్ఖత్వం కూడా వ్యక్తం అవుతుంది. ట్రంప్ చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో విచిత్రమైన చర్చకు దారి తీస్తాయి. తాజాగా ట్రంప్ ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన చర్చలో ఉన్నాయి…

ఇటీవల గ్రహాంతర వాసుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒబామా మాట్లాడిన మాటలను ట్రంప్ మరింత ఆసక్తికరంగా మార్చారు. గ్రహాంతరవాసులు, యు ఎఫ్ ఓ, యూఏపి లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. ఎంతో క్లిష్టమైన ఈ సమాచారంపై ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఉందని.. అయితే గ్రహాంతరవాసులు ఉన్నాయో? లేదో తనకు తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భయస్తుడని తేలిపోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper