Borugadda Anil Kumar : ఏపీలో( Andhra Pradesh) మరో సంచలన వార్త బయటకు వచ్చింది. వివిధ కేసుల్లో బెయిల్ పై ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఎస్కే పైనట్లు ప్రచారం నడుస్తోంది. వివిధ కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తల్లి అనారోగ్యం కారణాలతో గత నెల 15న ఆయనకు బెయిల్ లభించింది. రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యారు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు. దీంతో ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగింపు లభించింది. అయితే బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ అని గుర్తించారు పోలీసులు. అదే సమయంలో అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది.
* వైసిపి హయాంలో రెచ్చిపోయినా అనిల్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయేవారు బోరుగడ్డ అనిల్ కుమార్( borugadda Anil Kumar ). చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మెగా కుటుంబం పై కూడా నీచంగా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు అక్టోబర్లో అరెస్టు చేశారు. అప్పటినుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనిల్. బోరుగడ్డపై అనేక కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ.. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు.
* తల్లికి అనారోగ్యమని చెప్పి..
అయితే బెయిల్( bail ) రాకపోవడంతో బలమైన కారణాలు చూపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గత నెల 14న బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానము ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28 సాయంత్రం ఐదు గంటల లోగా జైలు సూపరింటెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయారు.
* అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్..
అటు తరువాత తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని.. చెన్నై అపోలో ఆసుపత్రిలో( Chennai Apollo Hospital) చికిత్స చేయించాలని.. మద్యంతర బెయిల్ పొడిగించాలని ఈనెల 1న అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది విచారణకు వచ్చింది. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ సర్టిఫికెట్ను ఆయన తరుపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. పద్మావతి ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కాగా ఈ సర్టిఫికెట్ ఫేక్ అని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడినట్లు తెలిసింది. అసలు ఆమె తల్లి గుంటూరు లలిత ఆసుపత్రిలో అసలు చేరలేదని.. ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని వెల్లడయింది. అదే సమయంలో అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బోరుగడ్డ ఈనెల 11న లొంగిపోతారా? లేదా? అన్నది చూడాలి.
Also Read : ప్రభుత్వ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే రచ్చ!