spot_img
Homeఆంధ్రప్రదేశ్‌NTR- Babu Gogineni: జూ.ఎన్టీఆర్ పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు.. తారక్‌పై ‘బాబు’గారి దండయాత్ర

NTR- Babu Gogineni: జూ.ఎన్టీఆర్ పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు.. తారక్‌పై ‘బాబు’గారి దండయాత్ర

NTR- Babu Gogineni: ఏపీలోని ‘హెల్త్ యూనివర్సిటీ’ పేరును వైఎస్ జగన్ సర్కార్ మార్చడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ‘ఎన్టీఆర్’ పేరు తీసేసి.. ‘వైఎస్ఆర్’ పేరు పెట్టడమే వివాదాస్పదమైంది. దీన్ని జగన్ , వైసీపీ నేతలు ఎంత సమర్థించుకున్నా ప్రతిపక్షాలు, వివిధ వర్గాలు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ, కమ్మ వర్గాలు అంతా ఏకమై జగన్ సర్కార్ పై దండయాత్ర చేస్తున్నాయి.

NTR- Babu Gogineni
NTR- Babu Gogineni

ఇక తన తాత పేరును తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ఈ వివాదంలో తలదూర్చాడు. ఎన్టీఆర్ నట వారసుడిగా సీరియస్ గా రియాక్ట్ అవుతాడని అంతా భావించినా.. ఎన్టీఆర్ మాత్రం ‘కర్ర విరగకుండా.. పాము చావకుండా’ సమతూకం పాటిస్తూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ వారసుడిగా ఆయనను కీర్తించాల్సింది పోయి.. ప్రత్యర్థి వైఎస్ఆర్ ను కూడా గౌరవిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడమే తెలుగు తమ్ముళ్ల పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు తమ్ముళ్లు రగిలిపోవడానికి కారణమైంది..

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్తాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్తాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రాజకీయాలను పక్కనపెడితే చాలా హుందాగా ఎన్టీఆర్ స్పందించారు. అయితే ఇందులో ఎన్టీఆర్ తో సమానంగా వైఎస్ఆర్ ను గుర్తించడమే తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోకుండా ఉంది.

NTR- Babu Gogineni
Babu Gogineni

ఎన్టీఆర్ హుందాగా స్పందించారని కొందరు అంటే.. వ్యతిరేక, టీడీపీ వర్గం వాళ్లు మాత్రం తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హేతువాది , బిగ్ బాస్ ఫేమ్ ‘బాబు గోగినేని’ తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ కాదు.. జూనియర్ వైఎస్ఆర్’ అంటూ సెటైర్ వేశారు. ఎన్టీఆర్ మనవడిగా ఈ వివాదంలోకి దూరిన జూనియర్ సమన్యాయం చేస్తానంటూ అసలు ఏ విషయం చెప్పకుండా ఒక ట్వీట్ పెట్టడం ఏంటి? అసలు ఈ హీరోకు దమ్ములేదా? పేరు మార్చినందుకు జగన్ ను నిలదీసే ధైర్యం లేదా? అంటూ విమర్శలు గుప్పించారు. నీ తాత పేరు యూనివర్సిటీకి పెట్టారు కదా.. మరి ఇంకొకరు తాత మంచోడని నువ్ చెప్పడం ఏంటి? చాలా సిల్లీగా ఉందంటూ ఎన్టీఆర్ పై బాగు గోగినేని విరుచుకుపడ్డారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

SKN Producer

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...
Telugu Heroes

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...
Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Oktelugu Epaper