Car Washer In Dubai: ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా మనకు మంచి చేస్తాయి. ఏదో టైంపాస్ కు లాటరీ టికెట్లు కొంటుంటారు. కానీ కొందరికి ఎన్ని టికెట్లు కొన్నా కలిసి రాదు. ఇంకొందరు అదృష్ట వంతులు ఒకసారి కొంటనే లక్ష్మీదేవి వారి ఇంటి తలుపు తట్టడం మామూలు విషయం కాదు. కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇటీవల రూ. 25 కోట్లు గెలుచుకుని అందరిని ఆశ్చర్యపరచాడు. ఇప్పుడు దుబాయ్ లో మరో శ్రీమంతుడు అవతరించాడు. లాటరీలో రూ.21 కోట్లు గెలుచుకుని అందరిలో ఆసక్తి పెంచాడు. దీంతో లాటరీ ప్రియులకు ఆశలు ఎక్కువవుతున్నాయి.

తాజాగా దుబాయ్ లో గత మూడేళ్లుగా కార్లు శుభ్రం చేసే పని చేస్తున్న నేపాల్ కు చెందిన భరత్ లాటరీ సొంతం చేసుకుని అందరికి ఆదర్శమయ్యాడు. తన జీవితంలో ఎదుర్కొన్న దుర్భర బతుకు గురించి వివరించాడు. తాను ఓ సామాన్యుడినే అని వివరించాడు. తన సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే తన తండ్రి రిక్షా నడుపుకుంటూ ఉంటున్నాడు. దీంతో భరత్ జీవితమే మారిపోనుంది. తన కుటుంబం అవసరాలు తీర్చేందుకు లాటరీ డబ్బు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాడు.
Also Read: NTR- Babu Gogineni: జూ.ఎన్టీఆర్ పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు.. తారక్‌పై ‘బాబు’గారి దండయాత్ర
తన స్నేహితులతో కలిసి భరత్ లాటరీ టికెట్ కొన్నాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బు వస్తుందని మాత్రం ఊహించలేదు. ఇంత డబ్బు రావడం తన అదృష్టమేనన్నాడు. కార్లు కడిగే తనకు ఇంతటి అదృష్టం రావడం సంతోషించదగినదే. నేపాల్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో లాటరీ పొందిన విజేతగా భరత్ నిలిచాడు. ఈ నేపథ్యంలో భరత్ గెలిచిన డబ్బుతో అతడి కుటుంబం స్థితి మారనుంది. దుబాయ్ లోని మెహజూజ్ లాటరీలో ఏకంగా రూ. 21 కోట్లు గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కూడా రూ. 25 కోట్ల లాటరీ గెలుచుకుని అందరిలో ఉత్కంఠ రేపాడు. అతడు శనివారం ఓనమ్ లాటరీ టికెట్ కొంటే ఆదివారమే బహుమతి దక్కడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు భరత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తమ అదృష్టాలు ఒకేసారి ఇలా తగలడంపై వారికి ఆనందమే కలుగుతోంది. జీవితంలో స్థిరపడేందుకు ఈ డబ్బు ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. తమకు కలిగిన అదృష్టానికి తికమకపడుతున్నారు. ఇప్పటికి కూడా నమ్మడం లేదు. ఇంతటి డబ్బు ఒకేసారి తమ చేతికి రావడం నిజంగా వరమే అని చెబుతున్నారు.
Also Read: RuPay Credit Card On UPI: ఈ మూడు బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త… ముందుగా వీళ్లకే ఆ కొత్త సేవలు?
[…] Also Read: Car Washer In Dubai: కారు క్లీన్ చేసే వ్యక్తికి మా… […]