RuPay Credit Card On UPI: బ్యాంకుల సేవలు ఖాతాదారులకు మరింత దగ్గర కానున్నాయి. లావాదేవీల్లో కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీచేసిన బ్యాంకులు ఇకపై రూపే కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన బ్యాంకుల సేవలను మరింత చేరువ చేయనున్నాయి. దీనికి గాను యూపీఐ పేమెంట్ ప్లాట్ ఫామ్ పై రూపే కార్డులను అనుసంధానం చేసుకునేందుకు తొలిసారిగా ముందుకొస్తోంది. రూపే కార్డుల జారీతో ఖాతాదారులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు అన్ని సిద్ధం చేసుకుంటోంది.

దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఇండియన్ బ్యాంకు ఖాతాదారులకు రూపే కార్డులు అందజేసేందుకు సంకల్పించాయి. క్రెడిట్ కార్డు కలిగిన వారు ఈ కార్డును సులభంగానే పొందవచ్చు. కానీ రూపే కార్డులతో అన్నింటికి లింక్ ఏర్పడుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు మరింత పెరగనున్నాయి. ఇలా చేస్తే క్రెడిట్ కార్డు, యూపీఐ వినియోగంతో డిజిటల్ వినియోగం సేవలు మరింత అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కానుంది. 2022 జులై నాటికి చాలా బ్యాంకులు ఈ సేవలను వినియోగించుకోనున్నాయి. దీంతో ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం బ్యాంకు సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకు సేవలు తొమ్మిది లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్ల వరకు చేరుకోవడం గమనార్హం. బ్యాంకుల సేవలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలే అని తెలుస్తోంది. భవిష్యత్ లో ఇవి మరింత పెరిగి ప్రజలకు ఇంకా దగ్గర కానున్నాయి.

క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో ఆర్థిక వ్యవహారాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో ఖాతాదారులు కూడా సులభంగా జరిగే వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. క్రెడిట్ కార్డులతో దాదాపు రూ.32 వేల కోట్ల వరకు వ్యయాలు జరిగాయంటే ప్రజలు ఎంతలా వినియోగించుకుంటున్నారో అర్థమవుతోంది. ఏప్రిల్ నెలలో రూ. 51 వేల కోట్లు ఉన్న లావాదేవీలు ఆగస్టు నాటికి రూ. 55 వేల కోట్లకు చేరడం గమనార్హం. దీంతో డిజిటల్ లావాదేవీల్లో ఎంత ప్రగతి కనిపిస్తోందో తెలుస్తూనే ఉంది.
[…] […]