Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Voter Survey: ఏపీ 'సర్' గుబులు.. భయపడుతున్న ఆ రెండు పార్టీలు!

Andhra Pradesh Voter Survey: ఏపీ ‘సర్’ గుబులు.. భయపడుతున్న ఆ రెండు పార్టీలు!

Andhra Pradesh Voter Survey: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్షాళన చేస్తోంది. ఈనెల 15 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది . ఓట్ల తొలగింపు కోసం అధికారపక్షాలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండేవి. అందుకే అంతలా […]

Andhra Pradesh Voter Survey: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్షాళన చేస్తోంది. ఈనెల 15 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది . ఓట్ల తొలగింపు కోసం అధికారపక్షాలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండేవి. అందుకే అంతలా కంగారు పడుతున్నాయి అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ తమకు అనుకూలమైన ఓట్లు జాబితాలో ఉంచి.. తమకు ప్రతికూలమైన ఓట్లను తొలగించారు. అటువంటి ఓట్లు ఇప్పుడు తొలగిస్తారు అన్న భయం ఆ రెండు పార్టీలకు వెంటాడుతోంది. ఆ కారణంగానే ఆ రెండు పార్టీలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి.

* ఇంటింటా సర్వే..
ఈనెల 15 నుంచి ఇంటింటికి వెళ్తున్న బూత్ లెవెల్ అధికారులు సమగ్ర సర్వే చేపడుతున్నారు. అత్యంత పారదర్శకంగా, డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా సాగుతోంది ఈ ప్రక్రియ. అర్హత ఉన్న ఈ ఓటరును కూడా తొలగించరు. కేవలం చనిపోయిన వారు, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు ఉంటే అటువంటి వారిని తొలగిస్తున్నారు. డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను మాత్రమే నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తొలగిస్తారు. ఇది సాధారణ, చట్టబద్ధమైన ప్రక్రియ కూడా. అయితే గతంలో బెంగాల్లో మమతా బెనర్జీ నానా హడావిడి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అక్రమ ఓటరు గుర్తింపు పొందిన వారు లేనిపోని హడావిడి చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అటువంటి చొరబాటుదారులకు ఛాన్స్ లేదు. అయితే గతంలో చాలా రకాల విన్యాసాలు చేశాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి. అందుకే ఇప్పుడు కంగారు పడిపోతున్నాయి.

* ఆ ఓట్లు పోతాయని భయం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేలాదిగా దొంగ ఓట్లు చేర్పించారన్న విమర్శలు ఉన్నాయి. అటువంటి ఓట్లు ఇప్పుడు గల్లంతు కాక తప్పవు. ఈ డిజిటల్ స్క్రూట్నీలో అడ్డంగా బుక్ కావడం ఖాయం. సర్వే ప్రక్రియపై పౌరులు, పార్టీలు అప్రమత్తంగా ఉండి తమ ఓట్లను వెరిఫై చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసలు ఓట్లు పూర్తిగా తొలగించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం వెనుక మాత్రం వారి భయం వారికి ఉంది. కేవలం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను మాత్రమే బూత్ లెవెల్ అధికారులు అమలు చేస్తారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలించి తప్పులు జరిగితే అడ్డుకోవచ్చు. కానీ రెండు తెలుగు పార్టీలు మాత్రం ఇప్పటినుంచే ఓటమికి కారణాలు వెతుకుతున్నట్టు స్పష్టమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper