spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP KGBV Recruitment 2026: ఏపీలో 1095 ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌ డేట్‌!

AP KGBV Recruitment 2026: ఏపీలో 1095 ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌ డేట్‌!

AP KGBV Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు నోటిఫికేషన్లు వచ్చినా కాంపిటేషన్‌ కనీవిని ఎరుగని రీతిలో ఉంటుంది. అత్యున్నత విద్యావంతులు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 1095 నాన్‌–టీచింగ్‌ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. చివరి తేదీ జనవరి 20. ఈ పోస్టులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇంటర్వ్యూల ద్వారా మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. విజయనగరం కలెక్టరేట్‌ వెబ్‌సైట్‌ (https://vizianagaram.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌ అప్లై చేయవచ్చు.

అర్హతలు,పోస్టుల వివరాలు..
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి:
– 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ, బీఈడీ, ఎంఏ ఎక్యుడేషన్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఎన్‌ఎం పాస్‌ అయినవారు అర్హులు. ఈ ఉద్యోగాలకు మహిళలే అర్హులు. విద్యాలయాల సామాజిక, పరిపాలనా కార్యకలాపాల్లో సహాయక పాత్రలు పోషిస్తాయి. దరఖాస్తు చేసినవారిని ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసే విధానం..
వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ ఫారం డౌన్‌లోడ్‌ చేయాలి. అందులో పూర్తి వివరాలు ఫిల్‌ చేయాలి. తర్వాత అర్హతలు సరిపోతే డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయండి. లాస్ట్‌ డేట్‌ ముందు సమయానికి సబ్మిట్‌ చేయాలి. రేపటితో గడువు ముగియనుంది. వెంటనే అర్హులు దరఖాస్తు చేసుకోండి.

కేజీబీవీలు మరింత బలోపేతం
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం వస్తే వైద్య సేవలు కూడా అందడం లేదు. ఉపాధ్యాయులే ప్రథమ చికిత్స చేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థుల సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లలో నమోదు చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. తాజాగా పోస్టులు భర్తీ అయితే ఉపాధ్యాయులపై భారం తప్పుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper