spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ramadan Holiday Date Change AP: సెలవు అని రిలాక్స్.. అయినా ఉదయం ఉరుకులు, పరుగులు...

Ramadan Holiday Date Change AP: సెలవు అని రిలాక్స్.. అయినా ఉదయం ఉరుకులు, పరుగులు తప్పలేదు

Ramadan Holiday Date Change AP: పిల్లలంతా సెలవు దినం( holiday) అని ఖుషి గా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా సెలవు దినం కావడంతో రిలాక్స్ అయ్యారు. అయితే ఇంతలోనే అత్యవసర ఉత్తర్వు జారీ అయ్యింది. ఈరోజు సెలవు కాదు.. వర్కింగ్ డే అని ప్రభుత్వం చెప్పడంతో అటు పిల్లలు, ఇటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. ఈనెల 19న ఉగాది, 20న రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు. అయితే గురువారం అర్ధరాత్రి తర్వాత శుక్రవారం సెలవు కాదని.. రేపు సెలవు దినమని చెప్పడంతో ఉదయం ఉరుకున, పరుగున వెళ్లడం కనిపించింది. రంజాన్ అనేది నెలవంక కనిపించడం పై ఆధారపడి ఉంటుంది. ముందుగా 20వ తేదీన రంజాన్ సెలవుగా ప్రకటించారు. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో నుంచి నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ పండుగ శనివారం వస్తుందని ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ క్రమంలో శుక్రవారం బదులు శనివారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

* తీవ్ర అసౌకర్యం..
అయితే ఒక్కసారిగా ఈ మార్పుతో శుక్రవారం ఉదయం పిల్లల తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికే ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. అర్ధరాత్రి ఉత్తర్వు రావడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెల్లవారి సమాచారం అందించాయి. అయితే వాట్సాప్ గ్రూపులో ఈ సమాచారం రాగా.. అప్పటికే సెలవు దినం అని ధీమాతో ఉండిపోయారు తల్లిదండ్రులు. అటువంటివారు ఉరుకులు పరుగుల మధ్య పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు సిద్ధం చేశారు. రంజాన్ సెలవు మారడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పు చేశారు. ఈనెల 21న నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ రెండు కు వాయిదా వేశారు. వాస్తవానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఇంగ్లీష్ పరీక్ష జరగాలి. కానీ ఇప్పుడు రంజాన్ మార్పుతో ఏప్రిల్ 2 కు ఆ పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు యధావిధిగా పనిచేస్తాయి.
* మరోవైపు ఇంటర్ పరీక్షలను సైతం రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షను ఈనెల 21 కాకుండా.. ఈనెల 25వ తేదీన నిర్వహిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు ఈ మార్పును గమనించాలని కోరారు మంత్రి నారా లోకేష్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper