Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress: ఏపీలో మత రాజకీయాలు.. నష్టం వారికే

YSR Congress: ఏపీలో మత రాజకీయాలు.. నష్టం వారికే

YSR Congress: ఏపీలో మతపరమైన రాజకీయాలు మొదలయ్యాయా? అనే అనుమానాలు ప్రారంభం అయ్యాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కుల రాజకీయాలను మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు మొదలయ్యాయి. ఆకివీడు పట్టణంలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇది ఇట్టే అర్థమవుతోంది. మున్ముందు ఈ పరిణామాలు కూడా ఇలానే ఉండబోతాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పై దాడి.. వెనువెంటనే అక్కడ బిజెపి, జనసేన స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. కేంద్రమంత్రి […]

YSR Congress: ఏపీలో మతపరమైన రాజకీయాలు మొదలయ్యాయా? అనే అనుమానాలు ప్రారంభం అయ్యాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కుల రాజకీయాలను మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు మొదలయ్యాయి. ఆకివీడు పట్టణంలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇది ఇట్టే అర్థమవుతోంది. మున్ముందు ఈ పరిణామాలు కూడా ఇలానే ఉండబోతాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పై దాడి.. వెనువెంటనే అక్కడ బిజెపి, జనసేన స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అయితే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ గుడి నిర్మిస్తామని ప్రకటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం మున్ముందు మతపరమైన సంఘర్షణలు జరిగే ఛాన్స్ ఉంది ఏపీలో. అయితే ఈ మతపరమైన రాజకీయాలు ఎవరికీ ప్రయోజనం అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పటికే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అనుమానపు చూపులు ఉన్నాయి. ఆ పార్టీపై హిందూయేతర ముద్ర ఉంది. అది మరింత పెరిగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

* బలంగా హిందుత్వవాదం..
ఏపీలో హిందుత్వవాదం అనేది బలంగా వెళ్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఆ పార్టీకి పదిలం. అదే సమయంలో హిందువుల్లో ప్రధాన సామాజిక వర్గాలు ఆ పార్టీకి 2014, 2019 ఎన్నికల్లో మద్దతు తెలిపాయి. 2024 ఎన్నికలు వచ్చేసరికి ఒక రకమైన ముద్రపడింది వైసిపి పై. దీంతో హిందుత్వ వాదాన్ని ఇష్టపడేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ప్రధాన విమర్శ. ఆపై తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం కూడా హిందువుల్లో ఒక రకమైన వ్యతిరేక భావన పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై.

* అంతిమంగా పార్టీపై ప్రభావం..
అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలిచే కొన్ని వర్గాలు.. హిందువులను వ్యతిరేకిస్తున్నాయి. హిందూ మత ఆచారాలకు వ్యతిరేకంగా వెళుతున్నాయి. అయితే ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమేయం లేనప్పటికీ.. ఆ పార్టీ పైనే ప్రభావం చూపుతోంది ప్రధానంగా. హిందువులంతా వైసీపీకి వ్యతిరేకం అని చెప్పలేం కానీ.. హిందుత్వ వాదానికి ఇష్టపడే వారు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు వ్యతిరేకించడమే కాదు ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు దోహదపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా వారు చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి డ్యామేజ్ తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీపై ఆ ప్రభావం ఉంది. తాజా పరిణామాలు మరింత ఎక్కువ చేస్తున్నాయి వాటిని..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper