Homeఎంటర్టైన్మెంట్NTR Kodali Nani Relationship Story: ఎన్టీఆర్ విషయంలో పరిటాల రవిని సైతం ఎదిరించిన కొడాలి...

NTR Kodali Nani Relationship Story: ఎన్టీఆర్ విషయంలో పరిటాల రవిని సైతం ఎదిరించిన కొడాలి నాని…తారక్ అంటే అంత ఇష్టమా…

NTR Kodali Nani Relationship Story: జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ కి భారీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి అతనికి విపరీతమైన అవకాశాలు రావడంతో ఎలాగైనా సరే ఆయన మాస్ సినిమాల వైపే అడుగులు వేయాలనే […]

NTR Kodali Nani Relationship Story: జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ కి భారీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి అతనికి విపరీతమైన అవకాశాలు రావడంతో ఎలాగైనా సరే ఆయన మాస్ సినిమాల వైపే అడుగులు వేయాలనే ప్రయత్నం చేస్తూ అలాంటి కథలనే ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కు మెంటర్ గా వ్యవహరించిన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ని టాప్ హీరోగా నిలబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తను ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారనే విషయాలను తెలుసుకున్న నాని ఎన్టీఆర్ ప్రతి సినిమా విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

ఇక సందర్భంలోనే పరిటాల రవి నుంచి ఒక ప్రపోజల్ వచ్చిందట. అదేంటి అంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన కథ ఉంది. ఆ సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని చెప్పారట. దాంతో కొడాలి నాని కి వాళ్ళు చెప్పిన కథ పెద్దగా నచ్చకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయనని చెప్పేసారట. నిజానికి అప్పట్లో పరిటాల రవి అంటే ప్రతి ఒక్కరికి చాలా భయం ఉండేది.

ఆయన చాలా మంచివాడనే పేరు సంపాదించుకున్నప్పటికి తనకు ఎదురుగా మాట్లాడే సాహసం ఎవరు చేసేవారు కాదట. కానీ కోడలి నాని మాత్రం సినిమా చేయమని చెప్పారట. ఎందుకని అలా చెప్పావు అని తన సన్నిహితులు నాని ని అడిగితే ఎన్టీఆర్ కెరీర్ బాగుండాలి. ఇప్పుడే సక్సెసులు వస్తున్నాయి. ఒక హీరోకి ఫ్లాప్ సినిమాలు వస్తే మళ్లీ సక్సెస్ లు రావడం అంత ఈజీ కాదు అని చెబుతూ ఉండేవాడట.

అందువల్లే ఆ కథలను రిజెక్ట్ చేసానని చెప్పారట.కొడాలి నాని ఎన్టీఆర్ ఎదగడానికి చాలా కృషి చేశాడు. ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…మొత్తానికైతే ఎన్టీఆర్ టాప్ లెవల్ హీరోగా మారడానికి కొడాలి నాని కూడా తీవ్రమైన ప్రయత్నం చేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper