Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) ఎండలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి ప్రతాపం చూపుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలే పంపింది. గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకటే పరిస్థితి నెలకొంది. ఏ జిల్లాలో కూడా 40 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లాలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 89 మండలాల్లో తీవ్రవాడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : ఏం ఎండలురా బాబూ.. ఇంత ఎండలూ ఎప్పుడూ చూడలా.. ఏపీలో ప్రజలకు అలెర్ట్
* సాధారణం కంటే గరిష్టం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉష్ణోగ్రతలు( temperature ) పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా నందన మారేళ్లలో 42.4, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సేదుపేటలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్రవడగాలులు, 91 మండలాల్లో వడగాలులు ఇచ్చాయి.
* తీవ్రవడగాలులు
ఈరోజు 89 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉంది. 208 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విజయనగరంలో( Vijayanagaram distric 22 మండలాలు, శ్రీకాకుళంలో 14, పార్వతిపురం మన్యంలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లిలో 9, తూర్పుగోదావరిలో 8, కాకినాడలో ఏడు, ఏలూరులో ఐదు, ఎన్టీఆర్ జిల్లాలో మూడు మండలాల్లో తీవ్రవడగాలు వీచే అవకాశం ఉంది.
* వడగాలులు వీచే మండలాలు..
సాధారణ వడ గాలులకు సంబంధించి పల్నాడులో 26, ఏలూరులో 22, గుంటూరులో 17, కృష్ణాజిల్లాలో 17, ప్రకాశం జిల్లాలో 14, శ్రీకాకుళం జిల్లాలో 14, కాకినాడ 13, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమలో 12, ఎన్టీఆర్ జిల్లాలో 12, తూర్పుగోదావరిలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 11, అనకాపల్లిలో 9, బాపట్లలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6, విజయనగరంలో ఐదు, విశాఖలో నాలుగు, పార్వతీపురం మన్యంలో 3, తిరుపతిలో రెండు, నెల్లూరులో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read : ఏపీలో 63 మండలాలకు బిగ్ అలెర్ట్