Sanjiv Goenka : ఐపీఎల్లో పది జట్లు ఉన్నాయి. కొన్ని జట్లను దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు నేరుగా ప్రమోట్ చేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు సంయుక్తంగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయా జట్లపై భారీగానే పెట్టుబడులు పెట్టాయి. ఐపీఎల్ లో ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్టుకే విలువ ఉంటుంది. ఫలితంగా వాటి మార్కెట్ విలువ విపరీతంగా ఉంటుంది. ఐపీఎల్ లో ఐదు సార్లు సంయుక్తంగా చెన్నై, ముంబై జట్లు విజయం సాధించాయి. వీటికి విపరీతమైన మార్కెట్ విలువ ఉంది. పైగా ఈ రెండు జట్లను రిలయన్స్, శ్రీనివాసన్ కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ రెండు జట్లు గెలిచినప్పుడు రిలయన్స్, శ్రీనివాసన్ కు చెందిన కంపెనీలు విర్రవీగలేదు. ఓడిపోయినప్పుడు కలత చెందలేదు. ఓటములను, గెలుపులను సాధారణంగా తీసుకున్నాయి. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. కానీ ఐపిఎల్ లో లక్నో జట్టు యజమాని తీరు వేరే విధంగా ఉంటుంది. వాస్తవానికి ఆయనకు క్రికెట్ తో సంబంధం లేదు. క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు.ఐ
Also Read : మళ్లీ మొదలెట్టావా ‘గొయెంకా’.. ఇలాగైతే లక్నో టీం బాగుపడదు సామీ
అప్పుడు అలా ఇప్పుడు ఇలా
ఐపీఎల్ లో జట్టుకు యజమాని అయిన సంజీవ్ గోయంక.. గత సీజన్లో లక్నో జట్టు హైదరాబాద్ పై ఓడిపోయినప్పుడు.. అప్పటి లక్నో జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైదానంలోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి బాధపడిన కేఎల్ రాహుల్ జట్టు నుంచి వైదొలిగారు. మెగా వేలంలో ఢిల్లీ జట్టుకు అమ్ముడుపోయారు. ఇక ఇటీవల మెగా వేలంలో రిషబ్ పంత్ ను కొనుగోలు చేసిన లక్నో జట్టు యాజమాన్యం అతనిని కెప్టెన్ చేసింది. ఈ సీజన్లో రిషబ్ పంత్ ఆధ్వర్యంలో లక్నో జట్టు ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో 200 కు పైగా పరుగులు చేసినప్పటికీ.. ఆ టార్గెట్ ను కాపాడుకోలేకపోయింది. దీంతో సంజీవ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ఆటగాళ్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపారు. మొదట్లో సంజీవ్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిఆటగాళ్లను విమర్శించారని ఆరోపణలు వినిపించాయి. కాకపోతే అవన్నీ నిరాధారమని.. సంజీవ్ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తినింపడానికే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడని మీడియాలో వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా కూడా ఇదే విషయాలను వెల్లడించింది. ఇక సంజీవ్ నింపిన క్రీడా స్ఫూర్తి వల్లే తమ జట్టు హైదరాబాద్ పై గెలిచిందని కెప్టెన్ రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు. ఇక గత సీజన్లో సంజీవ్ వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు చాలా తేడా ఉందని.. జట్లను కొనుగోలు చేసినట్టు మాత్రాన యాజమాన్యాలు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదని.. గెలుపు ఓటములను ఒకే తీరుగా తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా లక్నో జట్టు యజమానికి సూచిస్తున్నారు.
Moment of the day! ❤️
Rishabh Pant received a tight hug from the LSG owner Dr. Sanjiv Goenka! #RishabhPant #SanjivGoenka #LSGvSRH pic.twitter.com/2rKeLGuDax
— Utkarsh Raj (@utkrshhrj) March 27, 2025
Also Read : ఇదయ్యా బ్రాండ్ అంటే.. ఐపీఎల్ విలువ ఎంతో తెలుసునా?