Sanju Samson 2026 T20 Semi Final Performance: ది పారడైజ్ సినిమాలో.. ఆయా షేర్ అనే పాట విన్నారా.. ఆ పాట రీల్ లైఫ్ లో నానికి.. రియల్ లైఫ్ లో సంజు శాంసన్ కు సరిపోతుంది. ఎందుకంటే గురువారం నాటి సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మీద సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ అటువంటిది కాబట్టి. కేవలం 41 బంతుల్లో అతడు 89 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చి.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
సంజు 41 బంతుల్లో 89 పరుగులు చేయడం ద్వారా.. టీమిండియా భారీ స్కూల్ చేయగలిగింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 253 పరుగులను అత్యంత సులభంగా చేయగలిగింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సరైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే.. టీమ్ ఇండియా స్కోర్ ఈజీగా 270 మార్క్ చేరుకొని ఉండేది. సంజు 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. అతడు అలా ఆడటం వల్లే మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి తగ్గింది. ఇషాన్ కిషన్ 39, శివం దుబే 43, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగలిగింది.
అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్ కు 97 పరుగులు, శివం దుబే తో కలిసి మూడో వికెట్ కు 43 పరుగులు జోడించి.. టీమిండియాను పటిష్ట స్థితిలో ఉంచాడు సంజు శాంసన్. వెస్టిండీస్ జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో కూడా సంజు శాంసన్ భీకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 97* పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మళ్లీ ఇప్పుడు ఏకంగా 89 పరుగులు చేశాడు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి.. అదరగొట్టాడు సంజు.
అభిషేక్ శర్మ సరిగ్గా ఆడ లేకపోవడం.. రింకు సింగ్ విఫలం అవుతుండడంతో.. మేనేజ్మెంట్ సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చింది. దీంతో అతడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు తన టీజర్ చూపించాడు. ఆ తర్వాత అసలు సిసలైన ఫామ్ ప్రదర్శిస్తుండడంతో టీమిండియా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నది. సంజు ఇదే జోరు గనుక కొనసాగిస్తే అభిషేక్ శర్మ స్థానం గల్లంతయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.