మామూలు ఉత్కంఠ కాదు. ప్రతి పరుగు.. ప్రతి బంతి.. ఇలా ప్రతిదీ అభిమానులకు అసలు సిసలైన టి20 క్రికెట్ మజా అందించింది. భారీగా వచ్చిన ప్రేక్షకుల మధ్య ముంబై క్రికెట్ స్టేడియం జనసంద్రంగా మారిపోయింది. ఈ మైదానంలో టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసింది.
సంజు శాంసన్ (89) తిరుగులేని ఫామ్ కనబరిచాడు. ఇషాన్ కిషన్ (39), శివం దుబే(43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) దుమ్మురేపడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు 12 పరుగులను ఎక్స్ట్రా ల రూపంలో సమర్పించుకోవడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
254 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 13 పరుగుల వద్ద సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 38 పరుగుల వద్ద బ్రూక్(7) వికెట్ నష్టపోయింది. బట్లర్ (25) మూడో వికెట్ గా వెనక్కి వెళ్ళాడు.. జోరుగా ఆడిన బాంటను (17) కూడా అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బెతల్ (105), విల్ జాక్స్(35) టీమ్ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు కేవలం 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. విల్ జాక్స్ అవుట్ అయినప్పటికీ బెతల్ ఏ మాత్రం తగ్గలేదు. సామ్ కరణ్ తో కలిసి ఆరో వికెట్ కు 27 బంతుల్లో 50 పరుగులు జోడించాడు. కరణ్ ఔట్ అయిన తర్వాత.. పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. అప్పటిదాకా విజయం రెండు జట్ల మధ్య దోబూజులాడింది. ఒకానొక సమయంలో టీమిండియా కంటే ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. కానీ, చివర్లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. హార్దిక్ పాండ్యా కూడా సత్తా చూపించాడు . చివర్లో బెతల్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వచ్చింది. అయితే శివం దుబే వేసిన చివరి ఓవర్ లో ఆర్చర్ చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంత స్కోర్ చేసినప్పటికీ టీమిండియా కేవలం 7 పరుగుల తేడాతోనే విజయం సాధించింది.
ఈ గెలుపు ద్వారా టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లినప్పటికీ.. అది టీమ్ ఇండియా స్థాయి ఆట కాదు . ఎందుకంటే బౌలర్లు దారుణంగా పరుగులు ఇచ్చారు. ఫీల్డర్లు అద్భుతంగా బంతులను ఆపడంతో పాటు అనితరసాధ్యమైన క్యాచ్ లు అందుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. చివర్లో బెతల్ రన్ అవుట్ కాకపోతే మ్యాచ్ ఫలితం కూడా ఇంకో విధంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 253 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఇండియా చివరి వరకు ఆడటం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Economy Rate of bowlers in India vs England T20 World Cup Semi-Final:
Archer – 15.2
Jacks – 10
Overton – 12
Curran – 13.2
Rashid – 10.2
Dawson – 19
Arshdeep – 12.8
Varun – 16
Axar – 11.7
Dube – 22
Hardik – 9.5But Jasprit Bumrah – 8.2 pic.twitter.com/wPZwIxITjq
— Johns. (@CricCrazyJohns) March 5, 2026