https://oktelugu.com/

Rishabh Pant : SRH పై చెప్పినట్టే చేసిన రిషబ్ పంత్.. IPL లో ఇదో సంచలనం!

Rishabh Pant : ఐపీఎల్ లాంటి వేగానికి కొలమానమైన ఆటలో కెప్టెన్లు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చిన సందర్భాలు చాలా అరుదు..

Written By: , Updated On : March 28, 2025 / 09:46 AM IST
Rishabh Pant

Rishabh Pant

Follow us on

Rishabh Pant : ఐపీఎల్ లాంటి వేగానికి కొలమానమైన ఆటలో కెప్టెన్లు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చిన సందర్భాలు చాలా అరుదు.. అందుకే ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంలో కెప్టెన్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయరు. కానీ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ కు ముందు లక్నో జుట్టు కెప్టెన్ రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” వారు పెద్ద జట్టు కావచ్చు. గొప్పగా ఆడుతూనూ ఉండొచ్చు. హైదరాబాద్ వారి సొంత మైదానం కావచ్చు. వారు ఎన్ని పరుగులు చేసినా ఇబ్బంది లేదు. మేము వాటిని కచ్చితంగా అధిగమిస్తాం. ఇందులో అనుమానం లేదు. మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వారిని ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు. ఒకవేళ టాస్ గనుక మేము గెలిస్తే.. సంచలన నిర్ణయం తీసుకుంటాం. దానికి తగ్గట్టుగానే బౌలింగ్ వేస్తాం. ఆ తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాం. తొలి మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మమ్మల్ని తక్కువ అంచనా వేయవద్దు. మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయని” రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు.. రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ జట్టు అభిమానులు తేలిగ్గా కొట్టి పారేశారు. పిల్ల కాకి మాటలు మాట్లాడుతున్నాడని ఎగతాళి చేశారు. కానీ గురువారం నాటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పంత్ నాయకత్వ లక్షణాలు ఇలా ఉంటాయని హైదరాబాద్ అభిమానులకు తెలిసింది. టాస్ గెలిచిన రిషబ్ పంత్ రైజెస్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పరుగుల వరద అనే భావన నుంచి వికెట్లు కాపాడుకుంటే చాలు అనే ఆత్మ రక్షణ ధోరణిలోకి హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళను నెట్టిపడేశాడు.

Also Read : పంత్ భయ్యా.. 27 కోట్లు పెట్టి కొంటే ఇలా ఆడావ్ ఏంటి?

ఫలితాలు రాబట్టాడు

శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ ను రంగంలోకి దింపి రిషబ్ పంత్ ఫలితాలు రాబట్టాడు.. శార్దుల్ ఠాకూర్ ద్వారా వరుస బంతుల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ను వెనక్కి పంపించాడు.. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి దూకుడు కొనసాగించినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా రిషబ్ బౌలర్లతో మార్చి మార్చి బౌలింగ్ చేయించాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. ఇక చేజింగ్ లో రిషబ్ పంత్ తన బ్యాటర్ల మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని మార్క్రం మినహా మిగతావారు వమ్ము చేయలేదు. తద్వారా హైదరాబాద్ జట్టు సొంత గడ్డపై ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కోగా.. ఢిల్లీ జట్టుతో ఓటమి తర్వాత లక్నో జట్టు తొలి విజయాన్ని సాధించింది. పరుగుల వరద పారే మైదానంలో ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం రిషబ్ పంత్ చేసిన అతిపెద్ద సాహసం. వాస్తవానికి దీనిని చాలామంది తప్పుగా అనుకున్నారు. కాని చివరికి అదే ఫలితాన్ని అందించింది.

Also Read : రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తి.. నేడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే?