Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma T20 World Cup Failure: మళ్లీ విఫలమైన అభిషేక్ శర్మ.. అభిమానుల ఆగ్రహం

Abhishek Sharma T20 World Cup Failure: మళ్లీ విఫలమైన అభిషేక్ శర్మ.. అభిమానుల ఆగ్రహం

Abhishek Sharma T20 World Cup Failure: టి20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ విఫల ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మేనేజ్మెంట్ అవకాశాలు ఇవ్వడం.. వచ్చిన అవకాశాలను అతడు చేజార్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. కనీసం పట్టుమని పది బంతులు కూడా అతడు ఆడలేక పోతున్నాడు. రావడం.. వెళ్లిపోవడం.. ఇదిగో ఇలానే సాగిపోతోంది అతడి ఆటతీరు.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ జింబాబ్వే మీద మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు మిగతా అన్ని మ్యాచ్లో అతడు అయితే సున్న లేకుంటే పది లోపు పరుగులు చేసి అవుట్ అవుతున్నాడు. వాస్తవానికి అభిషేక్ శర్మ ఇలా ఆడతాడని ఏ అభిమాని కూడా ఊహించలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్ లో అతడు విఫలమైనప్పటికీ.. మొదటి బ్యాటింగ్ మీద మేనేజ్మెంట్ పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకుంది కాబట్టి.. అతడికి అవకాశాలు ఇచ్చింది. కానీ వచ్చిన అవకాశాలను అతడు ఏమాత్రం వినియోగించుకోవడం లేదు.

ఇంగ్లాండ్ జట్టుతో గురువారం ముంబైలో జరిగిన మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అతడు అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతడు సాల్ట్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు.

అభిషేక్ శర్మ అవుట్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు వినియోగించుకోలేకపోతున్నాడని. ఇలా అయితే ఇబ్బంది పడక తప్పదని చెబుతున్నారు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడానికైనా అతడు మైదానంలో దిగి ఆడుతున్నది అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్ లో సత్తా చూపించడాని అవకాశాలు ఇస్తే.. అతడేమో ఇలా అవుట్ అవుతున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అతని ఆట ఇలానే కొనసాగితే.. కష్టమని.. జట్టులో అవకాశం కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇషాన్ కిషన్ జట్టులో ఒకప్పుడు స్థానం కోల్పోయాడని.. ఆ తర్వాత తిరిగి సాధించడానికి చాలా ఇబ్బంది పడ్డాడని.. ఇప్పుడు వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగా ఆడటంలేదని.. ఇది సరైన పరిణామం కాదని అభిమానులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version