spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Heatwave Alert: ఏం ఎండలురా బాబూ.. ఇంత ఎండలూ ఎప్పుడూ చూడలా.. ఏపీలో ప్రజలకు...

AP Heatwave Alert: ఏం ఎండలురా బాబూ.. ఇంత ఎండలూ ఎప్పుడూ చూడలా.. ఏపీలో ప్రజలకు అలెర్ట్

AP Heatwave Alert: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు, ఆపై ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిన్నటి వరకు రెమాల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడతాయని హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఇప్పుడు ఎండలు భారీగా ఉంటాయని హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఏపీలో ఎండలు మండుతున్నాయి. అయితే గత నెల రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతుండడంతో ప్రజలకు ఉపశమనం కలిగించినట్లు అయ్యింది. కానీ మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ స్థాయిలో ఎండలు కాస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

రెమాల్ తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. అయితే తుఫాను ప్రభావం తెలంగాణకు ఉన్నంత ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం సైతం 160 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నెలాఖరకు రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం, పార్వతీపురం మన్యంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో మూడు మండలాలు, విజయనగరంలో ఐదు మండలాలు, పార్వతీపురం మన్యంలో నాలుగు మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని.. వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రెమాల్ తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పింది. కానీఆ తుఫాను ప్రభావం తెలంగాణ పై అధికంగా ఉంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఏపీలో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. రైతాంగానికి అవసరమైన స్థితిలో వర్షాలు పడటం లేదు. అయితే ఈ నెల చివరకు నైరుతీ రుతుపవనాలు కేరళ తీరానికి తాకుతాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో రుతుపవనాలు రాకతోనైనా వర్షాలు ప్రారంభమవుతాయని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతవరకు ఈ రాళ్లు పగిలే ఎండతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version