Annadata Sukhibhava: తెలుగు రాష్ట్రాల్లో రైతుల సంక్షేమానికి పదేళ్లుగా వివిధ పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణలో 2018 అప్పటి సీఎం కేసీఆర్ రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఇదే పథకాన్ని 2019లో వైఎస్సార్‌సీపీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ భరోసా పేరుతోఎట్టుబడి సాయం అందించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దీనిని పెంచి ఇస్తామని తెలిపింది. ఈమేరకు అన్నదాత సుఖీభవ పథకానికి ఎకారం చుట్టింది.
Also Read: జగన్ పై అభిమానం.. కూటమిపై తిట్ల వర్షం.. సికాకుళం యాసలో తిడితే ఆ కిక్కే వేరప్పా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం 2025లో కీలక దశకు చేరుకుంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జూలై 5 నుంచి అర్హత సమాచారం తెలుసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌తోపాటు టోల్ ఫ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
పథకం లక్ష్యం, ప్రయోజనాలు
అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి, వ్యవసాయ పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించబడింది. ఈ పథకం కింద ప్రతీ రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం మూడు విడతల్లో అందించబడుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద అందించే రూ.6 వేల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు ఇస్తుంది. మొదటి విడతలో రూ.7 వేలు,(పీఎం కిసాన్ రూ. 2, వేలు + రాష్ట్రం రూ. 5 వేలు), రెండో విడత రూ.7వేలు, మూడో విడత రూ.6 వేలు అందిస్తారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఈ సాయం ఉపయోగపడుతుంది. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుంది.
Also Read: అమరావతి మోడల్ నగర దిశగా – ఔటర్ రింగ్‌కి 140 మీటర్ల అప్రూవల్
47.77 లక్షల మంది అర్హులు..
వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. ఢిల్లీరావు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి 47.77 లక్షల మంది అర్హులను గుర్తించారు. వీరిలో 98% మంది ఈ కేవైసీ పూర్తి చేశారు. రైతులు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. జూలై 5 నుంచి అందుబాటులోకి వచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా రైతులు తమ అర్హత సమాచారం తెలుసుకోవచ్చు.
అర్హత లేని రైతులు ఏమి చేయాలి?
కొంతమంది అర్హత ఉన్నప్పటికీ జాబితాలో చేరని సందర్భాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అలాంటి రైతులు గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు లేదా మండల వ్యవసాయ అధికారిని కలవాలి. రైతు సేవా కేంద్రంలో అర్జీ సమర్పించాలి. అర్జీని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా పునఃపరిశీలనకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 155251 లేదా ‘1100 మీకోసం‘ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.