Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu Arrest: అంబటి రాంబాబు అరెస్ట్.. ఆ ఫ్లెక్సీ వివాదమే కారణం!

Ambati Rambabu Arrest: అంబటి రాంబాబు అరెస్ట్.. ఆ ఫ్లెక్సీ వివాదమే కారణం!

Ambati Rambabu Arrest: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసింది. తిరుమల లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది సిట్.. అయితే నెయ్యిలో ఎటువంటి జంతువు కలవలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినట్లు వైసిపి.. లేదు జంతువు కలిసిందని టిడిపి కూటమి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ […]

Ambati Rambabu Arrest: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసింది. తిరుమల లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది సిట్.. అయితే నెయ్యిలో ఎటువంటి జంతువు కలవలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినట్లు వైసిపి.. లేదు జంతువు కలిసిందని టిడిపి కూటమి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కూటమి తరుపున ఫ్లెక్సీలు వెలిసాయి. అయితే ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించాలని భావించింది. అందులో భాగంగా గుంటూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో అంబటి రాంబాబును టిడిపి శ్రేణులు అడ్డగించాయి. ఈ క్రమంలో అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అరెస్టు జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు అంబటి రాంబాబు. ఆయనను అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.

* ల్యాబ్ నివేదికతో..
నెయ్యి కల్తీ కి సంబంధించిన ఆరోపణలపై ఏర్పాటయింది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత కొద్ది నెలలుగా తిరుపతి కేంద్రంగా ఈ దర్యాప్తు కొనసాగింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో 600 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపు 36 మందిని నిందితులుగా తేల్చింది. మరోవైపు గుజరాత్లో ల్యాబ్ రిపోర్ట్ లో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. లేదు కొన్ని రకాల మిశ్రమాలతో పాటు జంతు కొవ్వు కలిసిందని టిడిపి కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్సెస్ టిడిపి కూటమి అన్నట్టు పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. గుంటూరులో సైతం ఇదే మాదిరిగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో మాజీమంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో వైసీపీ శ్రేణులు స్పందించాయి.

* గుంటూరులో సైతం..
గుంటూరులో వెలిసిన ఫ్లెక్సీల నేపథ్యంలో.. అంబటి రాంబాబు నేతృత్వంలో వైసిపి శ్రేణులు పాపప్రక్షాళనయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో భారీ ర్యాలీతో ముందుకు సాగుతున్న అంబటి రాంబాబును టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ.. అనుచిత కామెంట్లు మొదలుపెట్టారు. ఇది విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేశాయి. పోలీసులు అంబటి రాంబాబుకు రక్షణ కల్పిస్తూ అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం టిటిడి లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ వ్యవహారమే. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper