Homeఎంటర్టైన్మెంట్NTR: రామ్ చరణ్ కి కవలలు పుట్టిన వేళ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా...

NTR: రామ్ చరణ్ కి కవలలు పుట్టిన వేళ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా చెయ్యని పని చేసిన ఎన్టీఆర్!

NTR: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్ కి కవలపిల్లలు పిల్లలు పుట్టిన విషయాన్నీ ఆనందంతో పంచుకున్నాడు. అయితే సినీ సెలబ్రిటీలలో ఇప్పటి వరకు రామ్ చరణ్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తప్ప. […]

NTR: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్ కి కవలపిల్లలు పిల్లలు పుట్టిన విషయాన్నీ ఆనందంతో పంచుకున్నాడు. అయితే సినీ సెలబ్రిటీలలో ఇప్పటి వరకు రామ్ చరణ్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తప్ప. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. సొంత కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) లు కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపలేదు. సొంత కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా, బయటకు శుభాకాంక్షలు చెప్పాల్సిన పనేముంది, కచ్చితంగా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపి ఉంటారు, వెళ్లి కలిసి కూడా ఉంటారు.

కానీ క్లిన్ కారా పుట్టినప్పుడు రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మాత్రం అలాంటివి ఏమి చెయ్యలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం క్లిన్ కారా పుట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చేసాడు. దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య ఎంతటి స్నేహ బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో నిత్యం కొట్లాడుకుంటూ ఉంటారు. ఎదురు పడితే వీళ్ళ మధ్య పెద్ద విద్వంసం జరుగుతుందేమో అని భయం కూడా కలుగుతాడు. కానీ ఈ ట్వీట్ ని చూసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. స్నేహితులు అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వేసిన ఆ ట్వీట్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆ ట్వీట్ క్రింద కామెంట్స్ ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper