Amaravati Capital Development Projects: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తోంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు అమరావతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటు కానుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఏఐయుఎల్ఈఆర్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు కానుంది. అమరావతి లోని మందడం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఏపీ సిఆర్డిఏ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ట్రస్టుల తరుపున ప్రతినిధులు సంతకాలు చేశారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శాఖమూరు పరిధిలో 55 ఎకరాల భూమిలో ఏర్పాటు కానుంది.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
* 55 ఎకరాల విస్తీర్ణంలో..
రాజధానిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఒక్కొక్కటి పట్టాలెక్కుతున్నాయి. అందులో భాగంగా ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( India International University of Legal education and research) ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్, పెరల్ ఫస్ట్ చైర్మన్ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా ఆలోచనలతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే.. దేశంలోనే అత్యున్నతంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో న్యాయవిద్య, పరిశోధనలు, ప్రొఫెషనల్ శిక్షణ అందుబాటులోకి వస్తుంది. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఏకంగా రూ.300 కోట్లు దశలవారీగా కేటాయిస్తారు. ఈ నిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పెరల్ ఫస్ట్ చూసుకోనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే దాదాపు 200 మందికి ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.
* పర్యవేక్షణ బాధ్యతలు..
ఏపీ ప్రభుత్వం( AP government) అమరావతిలో మరో ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. అమరావతి గ్రూప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. దీనిని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా గా మార్చింది. ఈ మేరకు బిజినెస్ రూల్స్ లో సవరణ కూడా చేసింది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం స్మృతి వనం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతలను అమరావతి గ్రూప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించారు.