Sai Dharam Tej: సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం గురించే చర్చ నడుస్తోంది. కొంతమంది తీవ్రమైన విమర్శలు చేస్తుంటే , మరికొంతమంది మాత్రం పవన్ పై జాలి చూపిస్తున్నారు. అసలు వీళ్లిద్దరి మధ్య ఎందుకు విడిపోయే పరిస్థితులు వచ్చాయి అనే దానిపై ఆరాలు తీస్తున్నారు. ఎవరికీ సరైన కారణం తెలియకపోయినప్పటికీ, తమ సొంత ఊహాగానాలతో కథనాలు అల్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే కొంతమంది హద్దులు దాటి ప్రవర్తించడంతో, వాళ్లపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం చుట్టూనే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గానే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
కిరణ్మయి అనే అమ్మాయిని వచ్చే నెల ఆయన పెళ్లాడబోతున్నాడు. ఈమె సాయి ధరమ్ తేజ్ కి చిన్ననాటి స్నేహితురాలు అనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో వీళ్లిద్దరి నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే వచ్చే నెలలో జరిగే ఈ పెళ్ళికి అన్నా లెజినోవా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే అన్నా లెజినోవా కి మెగా ఫ్యామిలీ తో మొదటి నుండి అత్యంత సాన్నిహిత్యం ఉంది. అందరితోనూ చాలా క్లోజ్ గా ఉంటుంది. అలా సాయి ధరమ్ తేజ్ కూడా ఆమెకు అత్యంత సన్నిహితం. అందుకే సాయి ధరమ్ తేజ్ ఆమెని ప్రత్యేకంగా ఆహ్వానించాడని, అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపిందని అంటున్నారు. ప్రస్తుతం అన్నా లెజినోవా విదేశాల్లో ఉండడం వల్ల , నిశ్చితార్దానికి రాలేకపోయింది , కానీ పెళ్ళికి మాత్రం కచ్చితంగా వస్తుందని అంటున్నారు.
ఇదే కనుక జరిగితే సోషల్ మీడియా ఊగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా భర్త కుటుంబం తో సన్నిహితంగా మెలగడం అనేది సాధారణమైన విషయం కాదు. గతంలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. రేణు దేశాయ్ తో విడాకులు జరిగిన తర్వాత , ఆమె పిల్లలు పవన్ కళ్యాణ్ కుటుంబం తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు కానీ , రేణు దేశాయ్ మాత్రం లేరు. మెగా ఫ్యామిలీ లో జరిగిన శుభకార్యక్రమాలకు ఆమె ఎప్పుడూ హాజరు అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు అన్నా లెజినోవా పవన్ కుటుంబం తో సన్నిహితం గా మెలిగితే హాట్ టాపికే కదా. భార్య భర్తలుగా విడిపోతున్నామే కానీ , మేము మంచి స్నేహితులుగా భవిష్యత్తులో కొనసాగుతాము అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా. మరి అది ఎంత వరకు ఆచరిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.