Samsung galaxy A38 5G:స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. ఆకర్షణీయమైన డిజైన్.. అద్భుతమైన కెమెరా.. నాణ్యమైన డిస్ప్లే.. దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ గా ఉంది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. అదే Samsung galaxy A38 5G.
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారు సాధారణంగా కెమెరా.. ప్రాసెసర్.. బ్యాటరీ కి అధికంగా ప్రాధన్యమిస్తారు. రోజు మొత్తం ఫోన్ ఉపయోగించినప్పటికీ చార్జింగ్ సమస్య రాకూడదని భావిస్తుంటారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సాంసంగ్ గెలాక్సీ ఏ38 5 జీ లో పెద్ద బ్యాటరీని ఏర్పాటు చేసింది.
గతం మోడల్ ఫోన్లలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే కొత్త ఫోన్లో బ్యాటరీ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. అయితే చార్జింగ్ స్పీడ్ ఎంత ఉంటుంది.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏ స్థాయిలో ఉంటుంది.. అనే విషయాల మీద క్లారిటీ రావాలి. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి కెమెరా అనేది అత్యంత ముఖ్యం. ఫోటోగ్రఫీ.. వీడియోలు.. సోషల్ మీడియా రీల్స్ చేసేవారు కెమెరా క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. గెలాక్సీ ఏ 38 విషయంలో కెమెరా విభాగంలో భారీ మార్పులు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇందులో మూడు కెమెరాలు ఉండవచ్చు. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా.. 8 మెగాపిక్సల్ లేదా 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా.. ఫై మెగాపిక్సల్ మైక్రో కెమెరా.. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. అల్ట్రావైడ్ కెమెరా విషయంలో కూడా భిన్నమైన వివరాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై సాంసంగ్ కంపెనీ అధికారికంగా ఇంతవరకు ఎటువంటి వివరాలు ప్రకటించలేదు.
గత మోడల్ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ అమో లెడ్ డిస్ప్లే.. 120 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్లో ఏమైనా మార్పులు చేస్తారా.. అదేవిధంగా కొనసాగిస్తారా అని తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోన్ వచ్చేయడాది మార్చలేదా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో A 58 కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.