Ramayana Movie: నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ‘రామాయణ’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్నీ బాషలకు కలిపి 823 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ తో ప్రతిష్టత్మాక వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే మైండ్ అయ్యే రేంజ్ లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుండి 52 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి రాగా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 351 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుండి ఈ చిత్రానికి 80 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఈ వీకెండ్ తో ఆ ప్రాంతం లో 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా తమిళనాడు నుండి 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 20 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 295 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రం పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 827 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. టార్గెట్ చాలా పెద్దదే కానీ అవాళలీలగా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.