Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం సోషల్ మీడియా లో ఎంత పెద్ద చర్చ కి దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. వాళ్ళని కదిలిస్తే ఏడ్చే రేంజ్ లో ఉన్నారు. ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీ లు సైతం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ పత్రిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తో అత్యధిక శాతం కంట్రోల్ లో ఉన్నారు. కానీ కొంతమంది ఛాన్స్ […]

పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం సోషల్ మీడియా లో ఎంత పెద్ద చర్చ కి దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. వాళ్ళని కదిలిస్తే ఏడ్చే రేంజ్ లో ఉన్నారు. ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీ లు సైతం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ పత్రిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తో అత్యధిక శాతం కంట్రోల్ లో ఉన్నారు. కానీ కొంతమంది ఛాన్స్ దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు ట్రోల్స్ వేశారు. వినరాని బూతులతో పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి దూషించారు. కొంతమంది అయితే ఫోటోలను మార్ఫ్ కూడా చేశారు. ఒక రాష్ట్ర ఉప ఉపముఖ్యమంత్రి పై ఎలాంటి కామెంట్స్ చెయ్యకూడదో అలాంటి కామెంట్స్ అన్నీ చేశారు.

హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మొదటి నుండి హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఆకతాయిలు ట్రోల్స్ ఆపలేదు. దీంతో ట్విట్టర్ లో విశ్వ తారక్ అనే వ్యక్తిని బెంగళూరు లో అరెస్ట్ చేశారు పోలీసులు. అతనితో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 42 మంది కి నోటీసులు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియా లో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయే ఆకతాయిల గుండెల్లో కాస్త గుబులు పుట్టింది. విమర్శలు చేయొచ్చు కానీ , హద్దులు దాటి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మరోసారి ఈ సంఘటన తో రుజువు అయ్యింది. కాబట్టి హీరోల విషయం లో అభిమానులు హద్దులు దాటి పోరాడాల్సిన అవసరం లేదు , మనకి ఏదైనా జరిగితే మనమే చూసుకోవాలి , హీరోలు కనీసం పట్టించుకోరు, వ్యక్తి పూజ ఎప్పటికైనా డేంజర్ అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper