Homeఅంతర్జాతీయంAmerica mid term elections 2026: 15 కోట్లకు పైగా ఓట్లు.. అన్నీ పేపర్ బ్యాలెట్లు.....

America mid term elections 2026: 15 కోట్లకు పైగా ఓట్లు.. అన్నీ పేపర్ బ్యాలెట్లు.. గంటల్లోనే ఫలితాలు.. ఏం మ్యాజిక్ చేశారు..

America mid term elections 2026: అమెరికాలో 15 కోట్లకు పైగా ఓట్లు.. అవన్నీ కూడా పేపర్ బ్యారెట్ల రూపంలోనే నమోదయ్యాయి. దీనికి తోడు పదివేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఓటింగ్ పూర్తయిన గంటల సమయంలోనే ఫలితాలు వచ్చేసాయి. ఇది ఎలా సాధ్యం.. దీనికోసం ఏం మాయ చేసారు. ఎలాంటి మంత్రం వేశారు.. అమెరికా మధ్యంతర ఎన్నికలు (America mid term elections 2026) ఫలితాలు ఇంత తక్కువ సమయంలో రావడం.. అందర్నీ […]

America mid term elections 2026: అమెరికాలో 15 కోట్లకు పైగా ఓట్లు.. అవన్నీ కూడా పేపర్ బ్యారెట్ల రూపంలోనే నమోదయ్యాయి. దీనికి తోడు పదివేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఓటింగ్ పూర్తయిన గంటల సమయంలోనే ఫలితాలు వచ్చేసాయి. ఇది ఎలా సాధ్యం.. దీనికోసం ఏం మాయ చేసారు. ఎలాంటి మంత్రం వేశారు.. అమెరికా మధ్యంతర ఎన్నికలు (America mid term elections 2026) ఫలితాలు ఇంత తక్కువ సమయంలో రావడం.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత స్వల్ప సమయంలో అన్ని ఓట్లను ఎలా లెక్కించారు.. అసలు అది ఎలా సాధ్యమైందని చాలామందిలో ఒక రకమైన అనుమానం వ్యక్తమవుతోంది. అంతటి అమెరికాలో కౌంటింగ్ ప్రక్రియ ఎలా చేపడుతారు.. అన్ని కోట్ల ఓట్లను అంత వేగంగా ఎలా లెక్కించగలరు..

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో విజేతలు ఎవరో తెలిసిపోయింది. అత్యధిక రాష్ట్రాలలో డెమోక్రాట్లు విజయం సాధించారు. అటు సెనేట్.. ఇటు ప్రతినిధుల సభలో స్పష్టమైన లీడ్ సొంతం చేసుకున్నారు. నవంబర్ 3న ఈ ఎన్నికలు జరిగాయి. దాదాపు పది కోట్ల మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అంతకుముందే ఈమెయిల్..ప్రీ ఓటింగ్ విధానం ద్వారా సుమారు 5.7 కోట్ల మంది ఓటు వేశారు. అయితే చాలామంది ప్రజలు ఓటు వేసింది ఈ పేపర్ బ్యాలెట్ మీద. అయితే వాటిని రీడ్ చేయడానికి అధికారులు ఎలక్ట్రానిక్ స్కానర్లను ఉపయోగిస్తారు. అందువల్లే కౌంటింగ్ ప్రక్రియ సులభంగా సాగిపోయింది.

వేలాది పేపర్లు.. గంటల వ్యవధిలోనే

పేపర్ బ్యాలెట్ మీద అభ్యర్థి పేరు పక్కన ఒక బాక్స్ ఉంటుంది. అందులో ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత వెంటనే ఆ బ్యాలెట్ స్కానింగ్ మిషన్ వైపు వెళ్తుంది. అక్కడ స్కానర్ దాన్ని రీడ్ చేస్తుంది. ఆ తర్వాత అభ్యర్థి ఖాతాలో ఓటును జమ చేస్తుంది. పెద్దపెద్ద పోలింగ్ కేంద్రాలలో హై స్పీడ్ యంత్రాలు ఉంటాయి. ఇవి ప్రతిగంటకు వేలాది బ్యాలెట్ పేపర్లను అత్యంత సులభంగా స్కాన్ చేస్తాయి. ఓట్లను లెక్కిస్తాయి. యంత్రం స్కాన్ చేసినప్పటికీ.. బ్యాలెట్ పత్రాలను అధికారులు జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఒకవేళ ఓట్లలో తేడా అనిపిస్తే.. మాన్యువల్ విధానంలో పేపర్లను లెక్కించి.. ఫలితాన్ని వెల్లడిస్తారు.

అమెరికాలో ఉన్న ఓటర్లకు పోలింగ్ రోజు కంటే ఒకరోజు ముందుగానే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వ్యక్తులు తమకు దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగానే వెళ్లి.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్లలేని అవకాశం ఉన్నవారు పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇలాంటి అవకాశం అమెరికాలో 47 రాష్ట్రాలతో పాటు.. వాషింగ్టన్ డీసీ లో ఉంది. మధ్యంతర ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని దాదాపు 5.7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు.

43 రాష్ట్రాలలో పోస్టల్ పోట్లను పోలింగ్ రోజు ముందే అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు బ్యాలెట్ పేపర్లను స్కానింగ్ కోసం సిద్ధంగా ఉంచుతారు. ఓటర్ పేరును.. సంతకం.. ఇతర వివరాలను సమూలంగా పరిశీలిస్తారు. పోలింగ్ జరిగే రోజు ముందు వాటిని స్కాన్ చేస్తారు. ఆ తర్వాత లెక్కింపు చేపడతారు. పోస్టల్ బ్యాలెట్ లను కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ కంటే ముందే స్కాన్ చేసేందుకు అనుమతి ఉంది. ఫలితాలను ఓటింగ్ పూర్తి అయిన తర్వాతనే బయటికి ప్రకటిస్తారు.

అన్ని కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి, సహజంగా అయితే కౌంటింగ్ ప్రక్రియ పూర్తికావడానికి చాలా రోజులు పడుతుంది. అయితే గంటల్లో ఫలితం వచ్చింది అంటే దానికి కారణం కొన్ని మీడియా సంస్థలు చేసిన అధ్యయనాలు. 1848 నుంచి అసోసియేట్ ప్రెస్ ఎన్నికల ఫలితాలను బయటపెడుతోంది. కొన్ని మీడియా సంస్థలు పోలింగ్ కేంద్రాల నుంచి తమకు విశ్వసనీయమైన సమాచారాన్ని సేకరించి.. ఆ తర్వాత వివిధ మార్గాల ద్వారా అధ్యయనం చేసి.. విజేతలను వెల్లడిస్తాయి. అందువల్లే అక్కడ మీడియా సంస్థల్లో కౌంటింగ్ కొనసాగుతుండగానే ఫలితాన్ని ప్రకటిస్తారు.

ఉదాహరణకు ఒక అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో ఉంటే.. ఇంకా లెక్కింపు చేపట్టాల్సిన బ్యాలెట్లు 20వేల వరకు ఉంటే.. వాటిని పూర్తిగా లెక్కించినప్పటికీ… వెనుకబడి ఉన్న అభ్యర్థి విజయం సాధించడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. ఇలాంటి అంశాలను పూర్తిగా విశ్లేషించి.. ఆయా మీడియా సంస్థలు విజేతల వివరాలను వెల్లడిస్తాయి. అయితే ప్రస్తుతం వెలువడుతున్న విజేతల వివరాలు అధికారిక ఫలితాలు కావు. కేవలం ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం విజేతలను అధికారికంగా ప్రకటిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper