Homeఆంధ్రప్రదేశ్‌Rapthadu School Incident: రాప్తాడు లో ఏం జరిగింది.. ప్రేమోన్మాది స్కూల్లోకి ఎలా ప్రవేశించాడు.. వెలుగులోకి...

Rapthadu School Incident: రాప్తాడు లో ఏం జరిగింది.. ప్రేమోన్మాది స్కూల్లోకి ఎలా ప్రవేశించాడు.. వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు..

Rapthadu School Incident: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు పాఠశాలలో పదో తరగతి చదివే బాలికను ఓ దుర్మార్గుడు చెట్లు కోసే రంపంతో కోశాడు. నెత్తుటి మడుగులో ఆ బాలిక విలవిలలాడిపోయింది. అతడికి ఆ బాలికతో ముందుగానే పరిచయం ఉందా.. ప్రేమతో వేధించాడా.. పాఠశాలలోకి రంపంతో ప్రవేశించే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు.. అనే అంశాలు అత్యంత కీలకంగా మారాయి. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో గోపిక లక్ష్మి అనే బాలిక పదవ తరగతి చదువుతోంది. అయితే […]

Rapthadu School Incident: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు పాఠశాలలో పదో తరగతి చదివే బాలికను ఓ దుర్మార్గుడు చెట్లు కోసే రంపంతో కోశాడు. నెత్తుటి మడుగులో ఆ బాలిక విలవిలలాడిపోయింది. అతడికి ఆ బాలికతో ముందుగానే పరిచయం ఉందా.. ప్రేమతో వేధించాడా.. పాఠశాలలోకి రంపంతో ప్రవేశించే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు.. అనే అంశాలు అత్యంత కీలకంగా మారాయి.

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో గోపిక లక్ష్మి అనే బాలిక పదవ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక మీద స్థానికంగా పనిచేసే ఒక యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. ఆ అమ్మాయి ముఖం.. చేతులు.. కాళ్లకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. నెత్తుటి మడుగులో ఆ బాలిక విలవిలలాడిపోయిందని అక్కడి దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది

ఆ దుర్మార్గుడు గోపిక లక్ష్మి లక్ష్మి మీద దాడి చేస్తుంటే అదే స్కూల్లో చదువుతున్న ఆ బాలిక సోదరి.. సోదరుడు వెక్కివెక్కి ఏడ్చారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పేరు హేమంత్ అని తెలుస్తోంది. అతడు గోపికకు దగ్గర బంధువు అని సమాచారం. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే గోపిక తన ప్రేమకు అంగీకారం తెలపకపోవడంతోనే హేమంత్ ఉన్మాదిగా మారిపోయాడని తెలుస్తోంది. అందువల్లే అతడు ఎలక్ట్రిక్ రంపం తో దారుణంగా దాడి చేసినట్టు సమాచారం.

ధర్మవరం మండలం నాగలూరు ప్రాంతానికి చెందిన హేమంత్ కు తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే చనిపోయారు. కొన్నాళ్లుగా అయ్యవారిపల్లె అనే గ్రామంలో తన అక్క దగ్గర నివాసం ఉంటున్నాడు. గోపికను ప్రేమ పేరుతో కొద్దిరోజులుగా అతడు వేధిస్తున్నాడు. అయితే పోలీసులు అదుపులో ఉన్న అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాప్తాడు ప్రభుత్వ పాఠశాలకు ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. దాడి జరిగిన తరగతి గదిని పరిశీలించింది. హేమంత్ ఉపయోగించిన రంపాన్ని స్వాధీనం చేసుకుంది.

పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. పనులు చేసేందుకు చాలామంది ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారు. అందువల్లే హేమంత్ ను తాము అంచనా వేయలేకపోయామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు. అయితే క్లాసులో దాడి జరుగుతున్నప్పుడు.. అక్కడే టీచర్ కూడా ఉన్నారు. ఉదయం 10:30 సమయంలో దాడి జరిగింది. అయితే ఈ ఘటనను ఆపేందుకు వెళ్లిన ఒక విద్యార్థి కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం హేమంత్ ఏమాత్రం కనికరం లేకుండా రంపం వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper