Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini: విడదల రజిని వడ్డీతో సహా ఇస్తుందట..

Vidadala Rajini: విడదల రజిని వడ్డీతో సహా ఇస్తుందట..

Vidadala Rajini: సేమ్ అదే డైలాగ్.. సేమ్ అదే ఎక్స్ప్రెషన్.. ఏ మాత్రం తేడా లేదు.. చేతులు పైకి లేపి హెచ్చరించడం.. కళ్ళు మూసుకొని మాట్లాడటం.. హావభావాలను ప్రదర్శించడం.. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. అచ్చం జగన్ మాదిరిగానే.. ఎవరైనా సరే ఒక మనిషిని అనుకరించాలంటే.. అనుసరించాలంటే నూటికి నూరు శాతం సాధ్యం కాదు. కానీ దీన్ని చేసి చూపించారు మాజీ మంత్రి విడుదల రజిని. ఇటీవల విడదల రజిని తన నివాసం నుంచి బయటికి […]

Vidadala Rajini: సేమ్ అదే డైలాగ్.. సేమ్ అదే ఎక్స్ప్రెషన్.. ఏ మాత్రం తేడా లేదు.. చేతులు పైకి లేపి హెచ్చరించడం.. కళ్ళు మూసుకొని మాట్లాడటం.. హావభావాలను ప్రదర్శించడం.. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. అచ్చం జగన్ మాదిరిగానే.. ఎవరైనా సరే ఒక మనిషిని అనుకరించాలంటే.. అనుసరించాలంటే నూటికి నూరు శాతం సాధ్యం కాదు. కానీ దీన్ని చేసి చూపించారు మాజీ మంత్రి విడుదల రజిని.

ఇటీవల విడదల రజిని తన నివాసం నుంచి బయటికి రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక ఎస్సై తో రజిని వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కింద పడిపోయారు.. ఇక అప్పటినుంచి ఆమె సెంటిమెంట్ రాజకీయాలను మొదలుపెట్టారు. కూటమి నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని.. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడితోనే ఆగిపోలేదు.. పోలీసులను తమ మీదికి పంపిస్తున్నారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అటువంటి అధికారులను వదిలి పెట్టేది లేదని.. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే తీసుకొస్తామని.. వడ్డీతో సహా ఇస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి కామెంట్లు.. ఈ తరహా ఆస్కార్ లెవెల్ ఎక్స్ప్రెషన్ వీడియోలు సాక్షి టీవీకి.. సాక్షి పత్రికకు ఉపయోగపడతాయి. అయితే ఇందులో కూడా నెగిటివ్ కామెంట్లే వస్తాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజిని ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. చివరికి రైతుల దగ్గర్నుంచి లంచాలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు. ఇక్కడితోనే ఆగిపోలేదు.. రజని వేధింపుల వల్ల ఇబ్బంది పడ్డ వారంతా పోలీస్ కేసులు పెడితే.. దర్యాప్తులో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. గతంలో రజనికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తి అడ్డగోలుగా వ్యవహారాలు చేస్తే పోలీసులు పట్టుకోడానికి వచ్చారు. ఆ సమయంలో రజిని ఉమెన్ కార్డు అప్లై చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఒకప్పుడు చంద్రబాబు సైబరాబాద్ లో నాటిన మొక్క నేను అంటూ గొప్పగా చెప్పుకున్న రజిని.. ఆ తర్వాత వైసీపీలోకి ఎలా వెళ్లారు.. మంత్రి ఎలా అయ్యారు అనే విషయాలు అందరికీ తెలుసు.. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ప్రజాప్రతినిధుల మీద.. టిడిపి కేంద్ర కార్యాలయం మీద చేసిన దాడులు.. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అందువల్లే ఇప్పుడు కర్మ ఇస్ బ్యాక్ అనే సిద్ధాంతం వైసిపికి వాస్తవంలో బోధపడుతోంది. అయినా సాక్షి టీవీ ముందు.. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా ఇచ్చారు గాని.. స్థానిక ఎన్నికల్లో తన నియోజకవర్గం ఏది.. ఎక్కడి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించబోతున్నారు.. రజినికి ఏమైనా క్లారిటీ ఉందా.. ఇదే ప్రశ్నలను టిడిపి నేతలు వేస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper