Homeఆంధ్రప్రదేశ్‌Jogi Meghana: జోగి మేఘన పై జోగి రమేష్ కుటుంబం అంతకు తెగించిందా.. వెలుగులోకి సంచలన...

Jogi Meghana: జోగి మేఘన పై జోగి రమేష్ కుటుంబం అంతకు తెగించిందా.. వెలుగులోకి సంచలన నిజం

Jogi Meghana: వైసిపి నేత.. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన ఇటీవల తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. జోగి రమేష్ కుమారుడు తనను పెట్టిన ఇబ్బందులు, తాను ఎదుర్కొన్న కష్టాలను ఆ మధ్య ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మీడియా ఎదుట ఈ విషయాలను చెప్పింది. అప్పట్లో ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ కేసు […]

Jogi Meghana: వైసిపి నేత.. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన ఇటీవల తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. జోగి రమేష్ కుమారుడు తనను పెట్టిన ఇబ్బందులు, తాను ఎదుర్కొన్న కష్టాలను ఆ మధ్య ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మీడియా ఎదుట ఈ విషయాలను చెప్పింది. అప్పట్లో ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ కేసు విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది.

జోగి రమేష్ కుమారుడిని పెళ్లి చేసుకున్న నాటి నుంచి మేఘనకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కనీసం ఆమెతో జోగి రమేష్ కుమారుడు ప్రేమతో మాట్లాడింది లేదు. దగ్గరికి తీసుకుంది కూడా లేదు. ఆమెను ఒక గదిలో బంధించారు. పూజలు పునస్కారాలు చేసుకోకుండా చేశారు. చాలా సందర్భాలలో ఆమె మీద దాడులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాళ్ల కాళ్ల మీద పడితే కనికరించినట్టు మేఘన చెప్పుకొచ్చింది. అయితే ధైర్యం చేసి బయటికి వచ్చిన మేఘన.. తనకు ఎదురైన కష్టాలను చెప్పుకుంది. అయితే ఇప్పుడు మేఘనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.

మేఘన మీద హత్యాయత్నం జరిగిందని అనుమానాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. మేఘన.. ఆమె తండ్రి కృష్ణ ప్రయాణిస్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఇది కేవలం ప్రమాదం కాదని. మేఘనను చంపడానికి చేసిన కుట్ర అని చర్చ జరుగుతోంది.

ఈనెల 15న విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ వైపు మేఘన ఆమె తండ్రి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బస్సు మేఘన ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన ప్రయాణిస్తున్న వాహనం కొంత భాగం ధ్వంసం అయింది. అయితే ఈ ఘటనలో మేఘన.. ఆమె తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.. అయితే ఈ ఘటన వెనుక జోగి రమేష్ కుటుంబం హస్తం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనక మాజీమంత్రి రమేష్ ప్రమేయం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రమేష్ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమ వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ తో సహా.. కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులపై లోతైన విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ మేరకు పోలీసులు ఆయన చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

సరిగ్గా మూడు నెల క్రితం మేఘన తన మామ జోగి రమేష్.. భర్త రాజీవ్.. ఇతర కుటుంబ సభ్యుల మీద వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఇటువంటి ఆరోపణలు చేసింది. గతంలో గోవాలో ఉన్నప్పుడు తనను నీటిలో పడేసి చంపడానికి ప్రయత్నించారని మేఘన ఆరోపించింది. జోగి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లోనే మేఘన ఆరోపించింది. సరిగ్గా ఇప్పుడు అదే తరహాలో కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది సాధారణఘటన కాదని.. మేఘనను అంతం చేయడానికి చేసిన కుట్ర అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో వేధింపులు.. ఇప్పుడు ఈ ఘటన.. మొత్తంగా జోగి రమేష్ కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. మరి దీనిపై పోలీసు దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper