Homeఅంతర్జాతీయంInstagram New Feature:  ఇన్ స్టా కొత్త ఫీచర్.. యూట్యూబ్ కు గట్టి దెబ్బే..

Instagram New Feature:  ఇన్ స్టా కొత్త ఫీచర్.. యూట్యూబ్ కు గట్టి దెబ్బే..

Instagram New Feature:  సోషల్ మీడియా ప్రపంచంలో మరో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు రీల్స్.. షార్ట్ వీడియోలు.. ఫోటోలు.. స్టోరీలతో ఇన్ స్టా గ్రామ్ గుర్తింపు పొందింది. ఇకపై దీర్ఘకాలిక వీడియోలపై ఫోకస్ పెట్టింది. ఏకంగా 90 నిమిషాల పాటు వీడియో కంటెంట్ చూసే విధంగా ఫీచర్స్ అనే కొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టపోతోంది. దీనికి సంబంధించి పరీక్షలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. దీనివల్ల యూట్యూబ్ తో ఇన్ స్టా గ్రామ్ పోటీ పడుతుంది. […]

Instagram New Feature:  సోషల్ మీడియా ప్రపంచంలో మరో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు రీల్స్.. షార్ట్ వీడియోలు.. ఫోటోలు.. స్టోరీలతో ఇన్ స్టా గ్రామ్ గుర్తింపు పొందింది. ఇకపై దీర్ఘకాలిక వీడియోలపై ఫోకస్ పెట్టింది. ఏకంగా 90 నిమిషాల పాటు వీడియో కంటెంట్ చూసే విధంగా ఫీచర్స్ అనే కొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టపోతోంది. దీనికి సంబంధించి పరీక్షలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. దీనివల్ల యూట్యూబ్ తో ఇన్ స్టా గ్రామ్ పోటీ పడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫీచర్ కేవలం లిమిటెడ్ క్రియేటర్లతో టెస్టింగ్ స్టేజిలో ఉంది.

ఇప్పటివరకు ఇన్ స్టా గ్రామ్ లో చిన్న వీడియో చూసేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఒకవేళ నిడివి పెద్దవిగా ఉన్న వీడియో.. ఇతర పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ దాకా వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండకూడదని ఇన్ స్టా గ్రామ్ భావిస్తోంది.. అయితే ఈ మార్పు వల్ల యూట్యూబ్ కు పోటీ ఎదురవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు కంటెంట్ క్రియేటర్లకు కొత్త అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. యూజర్లు ఈ వేదికను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటివరకు లాంగ్ వీడియోలు.. సినిమా విశ్లేషణలు.. పాడ్ కాస్ట్ లు.. ఇంటర్వ్యూల కోసం చాలామంది యూట్యూబ్ దాకా వెళ్లేవారు. ఇలాంటి మార్పులతో యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కంటెంట్ క్రియేటర్లకు వేదికలాగా మారింది. అయితే ఇప్పుడు ఇన్ స్టా మాతృ సంస్థ మెటా కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తే పోటీ పెరిగే అవకాశం ఉంది.

ఇక ఇప్పటివరకు youtube లో వీడియోలు చేసే క్రియేటర్లు తమ కంటెంట్ ను ఇన్ స్టా లో చిన్న చిన్న రీల్స్ రూపంలో ప్రచారం చేసుకునేవారు. ఇకపై పూర్తి ఎపిసోడ్ మొత్తాన్ని ఇక్కడే అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. రీల్స్ లో నచ్చిన పాడ్ కాస్ట్ లేదా ఇంటర్వ్యూ క్లిప్ కనిపిస్తే.. దానికి లింక్ చేసిన పూర్తి వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో చూసేందుకు అవకాశం ఉంటుంది. యాప్ లు మారాల్సిన ఇబ్బంది ఉండదు.

మూవీ రివ్యూలు. పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూలు.. ఇతర కథనాలు.. స్పెషల్ స్టోరీలు. సెలబ్రిటీలతో డిస్కషన్ వంటి దీర్ఘ వీడియోలను రూపొందించే వారికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు యూజర్లను తమ ప్లాట్ఫారం లో ఉంచగలిగితే ఈ యాడ్స్ రూపంలో అవకాశాలు పెరుగుతాయి. ఇక లాంగ్ వీడియోలను టీవీలో కూడా చూసే విధంగా ఇన్ స్టా గ్రామ్ తన వీడియో సేవలను విస్తరిస్తుంది. పెద్ద తెరమీద పాడ్ కాస్ట్.. ఇంటర్వ్యూలు చూసే ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల యూట్యూబ్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper