Instagram features : ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తే అసలు లోకమే తెలియదు. టైమ్ పాస్‌కి ఏదో గంట చూద్దామని అనుకుంటారు. కానీ రోజంతా రీల్స్‌తోనే టైమ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్స్ ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్య యువత ఎక్కువగా రీల్స్ చేస్తూ రోజంతా దీనికే టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే మంచి అవకాశాలు వస్తాయని ఉద్దేశంతో ప్రస్తుతం ఎక్కువ మంది ఇన్‌స్టా వాడకాన్ని పెంచారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వాడుతున్నారు. ఇన్‌స్టాలో రీల్ అప్‌లోడ్ చేస్తే వైరల్ అవుతామనే ఉద్దేశంలో చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా దయ వల్ల చాలామంది సెలబ్రిటీలు అయ్యారు. మంచి అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం దీని వాడకం పెరిగిందని కొత్త కొత్త ఫీచర్లు కూడా తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లతో యూజర్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్‌నే ఎక్కువ మంది వాడుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటి? కొత్త ఫీచర్‌ను ఎలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలో.. మరి లేటు చేయకుండా తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్ ఉంది. దీనికి క్యాప్షన్ లేదా సాంగ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ప్రొఫైల్ ఫొటో కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ప్రొఫైల్ ఫొటో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాస్త కొత్త ఫీచర్ ఇన్‌స్టా తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌లో ప్రొఫైల్ సాంగ్‌ను పెట్టుకోవచ్చు. యూజర్లు తమ మూడ్‌ను బట్టి ప్రొఫైల్‌కు స్పెషల్ సాంగ్ పెట్టుకోవచ్చు. మీరు ఆనందంగా ఉన్నా బాధతో ఉన్నా సిట్యూవేషన్ బట్టి మీరు సాంగ్ పెట్టుకోవచ్చు. దీనికోసం కొన్ని లైసెన్స్ సాంగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ బయోలో ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ అనేది కనిపిస్తుంది. దానిపై మ్యూజిక్ ఐకాన్ ట్యాప్ చేస్తే పాట ప్లే అవుతుంది. అయితే మీరు కొత్త సాంగ్ మీరు మార్చుకునే వరకు పాత సాంగ్ అలానే ఉంటుంది. స్టోరీలా ఒక రోజు తర్వాత పోదు. మీరు మారిస్తేనే ప్రొఫైల్ సాంగ్ మారుతుంది.
ప్రొఫైల్ సాంగ్ యాడ్ చేయడం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ట్యాబ్‌లోకి వెళ్లి, ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన పాటను కేవలం 30 సెకన్లు ఉండేలా సెలక్ట్ చేసుకోవాలి. అంతే ఇక ప్రొఫైల్ సాంగ్ యాడ్ అయినట్లే.
Now you can brag about your music taste by adding a song to your profile ♬ pic.twitter.com/dSJuwlzh9b
— Instagram (@instagram) August 22, 2024