Homeటాప్ స్టోరీస్Tummidihatti Project: తుమ్మిడి హట్టి తెలంగాణకు ఎందుకు కీలకం? దేవేంద్ర ఫడ్నవీస్, రేవంత్ భేటీలో ఏం...

Tummidihatti Project: తుమ్మిడి హట్టి తెలంగాణకు ఎందుకు కీలకం? దేవేంద్ర ఫడ్నవీస్, రేవంత్ భేటీలో ఏం జరిగింది..

Tummidihatti Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య జరిగిన భేటీతో తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం పై కీలకమైన ముందడుగు పడింది. అయితే ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో తుది అనుమతి లభించలేదు. తెలంగాణ ప్రతిపాదన పై మహారాష్ట్ర సానుకూలంగా స్పందిస్తూ.. కీలకమైన అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా చర్చ ఏం జరిగింది బ్యారేజీ ఎత్తు.. గతంలో కుదిరిన ఒప్పందంలో 148 […]

Tummidihatti Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య జరిగిన భేటీతో తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం పై కీలకమైన ముందడుగు పడింది. అయితే ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో తుది అనుమతి లభించలేదు. తెలంగాణ ప్రతిపాదన పై మహారాష్ట్ర సానుకూలంగా స్పందిస్తూ.. కీలకమైన అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా చర్చ ఏం జరిగింది

బ్యారేజీ ఎత్తు.. గతంలో కుదిరిన ఒప్పందంలో 148 మీటర్ల ఎత్తు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం దానిని 152 మీటర్లకు పెంచాలని కోరింది.

నీటి లభ్యత.. ప్రతిపాదిత ఎత్తులో తెలంగాణకు ఎంత నీరు అందుతుంది.. సాగు అవసరాలను ఎలా తీర్చాలి అని అంశాలపై చర్చించారు.

ముంపు సమస్య.. మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఎంత మేరకు ముంపున గురవుతాయి.. ప్రభావిత ప్రాంతాల రైతులకు పరిహారం ఎలా చెల్లించాలి అనే అంశాలను పరిశీలించారు. సాంకేతిక అంశాలు.. పర్యావరణ ప్రభావం.. నీటి లభ్యత.. బ్యారేజీ నిర్మాణ అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

మహారాష్ట్రకు.. అక్కడి ప్రజలకు ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకపోతేనే తెలంగాణ ప్రతిపాదనను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫడ్నవిస్ సంకేతాలు ఇచ్చారు. అయితే తుది నిర్ణయానికి ముందు.. సాంకేతిక.. పర్యావరణ.. ముంపు.. పరిహారం అంటే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. దీనికోసం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి.. బ్యారేజీ ఎత్తు.. నీటి లభ్యత.. ముంపు ప్రభావం పై నివేదిక రూపొందించాలని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రలు నిర్ణయించారు.

తెలంగాణకు ఎందుకు కీలకం

తుమ్మిడిహట్టి బ్యారేజిని ప్రాణహిత నదిపై నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సాధ్యమైనంతవరకు గ్రావిటీ ఆధారంగా నీటిని తరలించి.. విద్యుత్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివాసీ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది.. అయితే అధికారుల కమిటీ సాంకేతిక నివేదికలు.. నీటి లభ్యత.. ముంపు విస్తీర్ణం.. రైతులకు పరిహారం అంటే అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిశీలనల అనంతరం రెండు రాష్ట్రాలు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper