Homeఆంధ్రప్రదేశ్‌APSRTC Driver Shiva:యముడినే ఎదురించి అమరుడైన ఆర్టీసీ డ్రైవర్..గుండెలు పిండేసే దారుణం ఇదీ

APSRTC Driver Shiva:యముడినే ఎదురించి అమరుడైన ఆర్టీసీ డ్రైవర్..గుండెలు పిండేసే దారుణం ఇదీ

APSRTC Driver Shiva: తనకు మృత్యువు ఎదురుగా నిలిచింది. అయినప్పటికీ అతడు భయపడలేదు. తన ప్రాణం పోయినా సరే తోటి ప్రయాణికులకు ఆపద రాకూడదని అనుకున్నాడు. గుండెల్లో భరించలేని బాధ.. తట్టుకోలేని నొప్పి.. శరీరం సహకరించడం లేదు.. అయినప్పటికీ స్టీరింగ్ మీద పట్టు వదలలేదు. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశాడు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. చివరికి అదే సీటులో కన్నుమూశాడు.. అతని పేరు శివ.. ఇది కేవలం ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణ వార్త […]

APSRTC Driver Shiva: తనకు మృత్యువు ఎదురుగా నిలిచింది. అయినప్పటికీ అతడు భయపడలేదు. తన ప్రాణం పోయినా సరే తోటి ప్రయాణికులకు ఆపద రాకూడదని అనుకున్నాడు. గుండెల్లో భరించలేని బాధ.. తట్టుకోలేని నొప్పి.. శరీరం సహకరించడం లేదు.. అయినప్పటికీ స్టీరింగ్ మీద పట్టు వదలలేదు. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశాడు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. చివరికి అదే సీటులో కన్నుమూశాడు.. అతని పేరు శివ.. ఇది కేవలం ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణ వార్త కాదు.. విధిపట్ల అంకితభావానికి.. నిలువెత్తు మానవత్వానికి బలమైన నిదర్శనం.

రోజు వందలాది మంది ఆర్టీసీ డ్రైవర్లు వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేరుస్తూ ఉంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాన్ని చేర్చడం వారి బాధ్యత. కొన్నిసార్లు వారి బాధ్యత ప్రాణాల కంటే గొప్పదిగా మారిపోతుంది. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ విషయంలో కూడా ఇదే జరిగింది.

బస్సు ప్రయాణం సాగిపోతుంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా తమ తమ పనుల్లో.. ఆలోచనలలో.. మాటలలో మునిగిపోయి ఉన్నారు. కొందరు గమ్యస్థానానికి చేరుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరికొందరు వృత్తి గత.. వ్యక్తిగత పనుల్లో ఉన్నారు. స్టీరింగ్ పట్టుకున్న శివకుమాత్రం ఒక్కసారిగా తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. ఆ క్షణంలో ఆయన ఎంతటి అనుభవించాడో మాటల్లో చెప్పలేం. శరీరం సహకరించలేదు. పరిస్థితి విషమిస్తోంది. అయినప్పటికీ ఆయన తన ప్రాణం గురించి ఆలోచించలేదు. తన చేతుల్లో ఉన్న 40 మంది ప్రయాణికుల భద్రత గురించి మాత్రమే ఆలోచించాడు.

తనకు ఏమవుతుందో తెలియని పరిస్థితిలోనూ శివ బస్సు పై నియంత్రణ కోల్పోలేదు. ప్రయాణికులకు ఎటువంటి ఘొరం జరగకూడదని ఆలోచనతో బస్సును జాగ్రత్తగా నిలుపుదల చేశాడు. ఒక్కసారి ఆలోచిస్తే వేగంగా వెళుతున్న బస్సులో డ్రైవర్ కు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే.. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది.. బస్సు అదుపుతప్పితే ఎంతమంది ప్రాణాలు ప్రమాదాల్లో పడతాయి.. ఒక్క క్షణం అది ఎంతటి విషాదానికి దారి తీయవచ్చు.. అలాంటి సమయంలో కూడా శివ చూపిన సమయమనం.. ప్రయాణికుల భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంతో విలువైంది.. బస్సును సురక్షితంగా ఆపిన అనంతరం ఆయన అదే డ్రైవర్ సీట్ లో తుది శ్వాస విడిచిన దృశ్యాలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. శివ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. ఒక ఇంటికి ఆధారమైన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అది మాటల్లో చెప్పలేని విషాదం. ఆయన కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులకు ఈ నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. అదే సమయంలో ఆయన నడిపిన బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది సురక్షితంగా బయట పడగలిగారనే విషయం మామూలుది కాదు.

శివా.. మీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ మీ చేతిలో ఉన్న స్టీరింగ్ చివరి క్షణం వరకు బాధ్యతగా పట్టుకున్నారు. ఈ తీరు మానవత్వానికి ఒక గుర్తుగా నిలిచిపోతుంది. నీ ప్రాణం నిలవలేదు. కానీ మీ చివరి ప్రయత్నం నల్లమందు ప్రాణాలను కాపాడింది. సెల్యూట్ శివ.. విధిపట్ల మీ అంకిత భావానికి.. ప్రయాణికుల భద్రతకు మీరు ఇచ్చిన ప్రాధాన్యానికి శతకోటి వందనాలు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper