Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: అన్నదాతల్లో " పట్టా" లేని ఆనందం.. ఇదీ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

Chandrababu Naidu: అన్నదాతల్లో ” పట్టా” లేని ఆనందం.. ఇదీ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

Chandrababu Naidu: ఆ బుక్కు చూసుకున్న తర్వాత.. తమ పేరు మీద భూమి ఉందని ప్రభుత్వం గుర్తించిన తర్వాత.. అగ్రికల్చర్ లోన్లు ఇస్తారని తెలిసిన తర్వాత.. ఇన్ని రోజులపాటు పడిన ఇబ్బందులు మటుమాయమయ్యాయని తెలిసిన తర్వాత.. ఆ రైతుల కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. ఆ ఆనందాన్ని నింపింది చంద్రబాబు. తన పనితీరుతో.. తన ముందు చూపుతో.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి రైతుల ముఖాలలో ఆయన సంతోషాన్ని పరిపుష్టం చేశారు. కొండేపిలో చంద్రబాబు పర్యటించారు. మీ భూమి […]

Chandrababu Naidu: ఆ బుక్కు చూసుకున్న తర్వాత.. తమ పేరు మీద భూమి ఉందని ప్రభుత్వం గుర్తించిన తర్వాత.. అగ్రికల్చర్ లోన్లు ఇస్తారని తెలిసిన తర్వాత.. ఇన్ని రోజులపాటు పడిన ఇబ్బందులు మటుమాయమయ్యాయని తెలిసిన తర్వాత.. ఆ రైతుల కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. ఆ ఆనందాన్ని నింపింది చంద్రబాబు. తన పనితీరుతో.. తన ముందు చూపుతో.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి రైతుల ముఖాలలో ఆయన సంతోషాన్ని పరిపుష్టం చేశారు.

కొండేపిలో చంద్రబాబు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా కొండేపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సుమారు 8500 మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించారు. సుమారు నాలుగు మండలాల్లోని 8 గ్రామాలకు చెందిన 1301 మంది రైతులకు సంబంధించిన 2,915 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించారు. భూ రికార్డులలో లోపాలను సరి చేశారు. వివాదాలలో ఉన్న భూములకు పరిష్కారం చూపించారు.

ప్రకాశం జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న గర్భ కండ్రిగ భూ వివాదం ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాన అంశంగా నిలిచింది. ఈ వివాదానికి సంబంధించి నాలుగు మండలాల్లోని 8 గ్రామాల్లో విస్తరించిన 2915 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించారు. ఈ ప్రక్రియ ద్వారా 1301 మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించారు. అంతేకాదు వివాదాస్పదమైన భూముల స్థితిని తొలగించి.. అర్హులైన రైతులకు హక్కులను గుర్తించే ప్రక్రియ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది చివరి దశలో ఉంది. ఇది కనుక పూర్తయితే కర్షకులకు ప్రయోజనం జరుగుతుంది. ఈ భూములు కొండేపి.. జరుగుమల్లి.. నాగులుప్పలపాడు.. సింగరాయకొండ మండలాలలో ఉన్నాయి. కొండేపి మండలంలోని ఇలవర.. వెన్నూరు గ్రామాలు.. జరుగుమల్లి మండలంలోని పచవ.. వర్దినేనిపాలెం.. నర్సింగోలు… కె బిట్రగుంట.. నాగులుప్పలపాడు మండలంలోని ఒబ్బన్నపాలెం.. సింగరాయకొండ మండలంలోని కళికబాయ గ్రామాలలో రైతులు భూ సమస్యల నుంచి విముక్తి పొందారు.

వాస్తవానికి రైతుకి ప్రధాన ఆస్తి భూమి. సాగు నుంచి మొదలుపెడితే బ్యాంకు రుణాలు పొందే వరకు అనేక అవసరాలకు రైతులకు భూమి యాజమాన్యానికి సంబంధించిన రికార్డులు అత్యంత కీలకంగా ఉంటాయి. భూమి విస్తీర్ణం.. సర్వే నెంబర్.. యాజమాన్యంలోని వివరాలలో తేడాలు ఉంటే రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో పాటు.. భూ రికార్డులలో తప్పులను సరి చేయడం.. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం అవసరమని రైతులు భావిస్తుంటారు పాసు పుస్తకాల ద్వారా భూములకు సంబంధించిన వివరాలు స్పష్టంగా అందుబాటులో ఉంటే భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు ఉండవు. పాసు పుస్తకం జారీ తోనే భూ వివాదం పరిష్కారమైనట్టు కాదు. సంబంధిత రికార్డుల సవరణ.. హక్కుల నమోదు.. న్యాయపరమైన అభ్యంతరాల పరిష్కారం కూడా పూర్తి కావాల్సి ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణ.. పాసు బుక్కుల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నెలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4.58 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ భూమి మీ హక్కు ద్వారా రైతులకు యాజమాన్య వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. రీ సర్వే ద్వారా భూ సమస్యలను పరిష్కరించింది. భూ రికార్డులలో కూడా పారదర్శకతను పెంచింది .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper