Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: ఏడు రోజులు.. ఐదు అద్భుతాలు.. చంద్రబాబు స్కెచ్ వేస్తే అలా ఉంటుంది మరి..

Chandrababu Naidu: ఏడు రోజులు.. ఐదు అద్భుతాలు.. చంద్రబాబు స్కెచ్ వేస్తే అలా ఉంటుంది మరి..

Chandrababu Naidu: ఏడు రోజులు.. క్షణం తీరికలేదు. ఇందులో ఐదు ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. అందులోనూ కేంద్ర మంత్రులు వచ్చారు. హంగూఆర్భాటం తో కాకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ముఖచిత్రం సమూలంగా మార్చివేసే కార్యక్రమాలు ఇవి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు రూపు దిద్దుకోవడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేశాయి. తద్వారా వెనుకబడిన ప్రజలకు.. అభివృద్ధికి నోచుకోని వర్గాలకు ఏపీ సీఎం […]

Chandrababu Naidu: ఏడు రోజులు.. క్షణం తీరికలేదు. ఇందులో ఐదు ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. అందులోనూ కేంద్ర మంత్రులు వచ్చారు. హంగూఆర్భాటం తో కాకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ముఖచిత్రం సమూలంగా మార్చివేసే కార్యక్రమాలు ఇవి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు రూపు దిద్దుకోవడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేశాయి. తద్వారా వెనుకబడిన ప్రజలకు.. అభివృద్ధికి నోచుకోని వర్గాలకు ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాలు సంజీవనీలాగా మారాయి.

11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి.. లక్ష కోట్లతో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్..30,136 కోట్లతో జల్ జీవన్ మిషన్ 2.0.. మూడు లక్షల గృహ నిర్మాణానికి శ్రీకారం.. పేదల ఇళ్లకు పట్టాల పంపిణీ.. ఇలా వారం రోజుల వ్యవధిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాలు.. చేసిన ప్రకటనలు.. ప్రస్తావించిన సమస్యలు.. చూపించిన పరిష్కార మార్గాలు.. వ్యవసాయం.. తాగునీరు.. గృహ నిర్మాణంపై ప్రభుత్వ ప్రాధాన్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. గత నెల 29న మొదలైన ఈ కార్యక్రమాల పరంపర ఈ నెల తొలివారం వరకు కొనసాగింది.

గ్రామాల అభివృద్ధి నుంచి రైతుల ఆదాయం పెంపు వరకు.. పేదలకు ఇళ్ల స్థలాల హక్కుల నుంచి సొంతింటి నిర్మాణం వరకు వేరువేరు రంగాలను ఒకే అభివృద్ధి ఎజెండాతో అనుసంధానించే ప్రయత్నం ముఖ్యమంత్రి పర్యటనల్లో కనిపించింది. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలు.. ప్రకటించిన లక్ష్యాలు.. ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేశాయి.

పల్లె పండుగ 3.0

సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని రామపురం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు 11,085 కోట్ల విలువైన పనులను ఈ కార్యక్రమంలో ప్రకటించారు.

పనుల వివరాలు

  • 6000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి 2700 కోట్లు
  • 9500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం
  • పశువుల పెంపకం దారులకు ఉపయోగపడే 22వేల మినీ గోకులాల ఏర్పాటు
  • 1000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం
  • 50,000 ఎకరాలలో ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యం

గ్రామ సభ ద్వారా స్థానిక అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో సుమారు పదివేల మందికి పదోన్నతులు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 4,136 కోట్లను ఖర్చు చేసింది… గ్రామాలలో రహదారులు.. మరుగునీటి పారుదల.. పశుసంవర్ధక మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది.

పేదలకు పట్టాభిషేకం

సెప్టెంబర్ 30న విజయవాడలో పేదల మోముల్లో ‘పట్టా’లేని ఆనందాన్ని ప్రభుత్వం నింపింది. ఇళ్ల స్థలాలపై పేదలకు యాజమాన్య హక్కులు కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 26,401 మంది పేదలకు పట్టాలు ఇచ్చింది. అంతకు ముందు విశాఖపట్నంలో 28,445 మంది పేదలకు ఇదే తీరుగా పంపిణీ చేసింది. యాజమాన్య బదిలీ పథకాలు కూడా అందించింది. విజయవాడలో మరో 24 వేల మందిలో ఆనందం నింపుతామని ప్రకటించింది.

రాయలసీమ రైజింగ్

అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో రాయలసీమ రైసింగ్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారు లక్ష కోట్ల పెట్టుబడి లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు రాయలసీమ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన పంటల సేకరణ కేంద్రాలు..ప్యాక్ హౌసులు.. కోల్డ్ స్టోరేజీలు.. ప్రాసెసింగ్ యూనిట్లు.. మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టమాట.. మామిడి.. బొప్పాయి.. నిమ్మ.. పుచ్చకాయ.. ఉల్లి వంటి పంటలకు అనుకూలమైన ప్రాంతాలను ఆధారంగా చేసుకొని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జల్ జీవన్ మిషన్

అక్టోబర్ ఐదు న కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం లో కొత్తపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ 2.0 అమర జీవి జనగాల ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ పథకం కోసం 30,136 కోట్లను కేటాయించారు. ఈ నిధుల ద్వారా 50,315 పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా 27.36 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు కల్పిస్తారు. ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో 61.60 లక్షలను స్థిరీకరిస్తారు. తద్వారా రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సదుపాయాలు విస్తరిస్తారు. నీటి కొరతను అధిగమించడం.. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు అందించడం.. ఫ్లోరైడ్ వంటి నీటి నాణ్యత సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలను ప్రధానంగా పరిష్కరిస్తారు.

పేదలకు మూడు లక్షల గృహాలు

అక్టోబర్ 4న గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలోని బుర్రిపాలెం లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద మూడు లక్షల గృహాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ ఫండ్స్ రూ. 3600 కోట్లను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు 2029 నాటికి సొంత గృహాన్ని కల్పించాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. కేంద్రం ముందుగా సాధారణ కేటాయింపుల్లో భాగంగా 75 వేల గృహాలను మాత్రమే మంజూరు చేసింది. అంతేకాదు రాష్ట్రం కోరిన 3 లక్షల గృహాలకు ఆమోదం ఇచ్చింది.. ఇక ఇదే కార్యక్రమంలో బుర్రిపాలెం.. ఓబుల నాయుడుపాలెంలో 3d కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో 177 గృహాల నిర్మాణానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీని అంచనా వ్యయం 14 కోట్లు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణ సమయం.. ఖర్చును తగ్గించి.. గృహాలను నిర్మించడం దీని ఉద్దేశం.

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ తొలివారం వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలను పరిశీలిస్తే.. ఐదు ప్రధాన రంగాల మీద దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.

  • గ్రామీణ అభివృద్ధి.. పల్లె పండుగ 3.0 స్కీం కింద రోడ్లు.. డ్రైన్లు. పశుసంవర్ధక మౌలిక వసతుల కల్పన.
  • పేదలకు ఆస్తి హక్కులు.. పేదలకు పట్టాభిషేకం ద్వారా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ.
  • రైతుల ఆదాయం.. రాయలసీమ రైజింగ్ ద్వారా ఉద్యాన పంటల సేకరణ.. నిల్వ.. ప్రాసెసింగ్.. మార్కెటింగ్ వ్యవస్థల అభివృద్ధి.
  • తాగునీటి భద్రత.. జల జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్ల విస్తరణ..
  • గృహ నిర్మాణం..పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద మూడు లక్షల గృహాల నిర్మాణం..

మొత్తంగా చూస్తే పల్లెల్లో మౌలిక వసతుల కల్పన.. రాయలసీమలో వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పేదలకు ఆస్తి హక్కులు.. సొంతింటి కల.. సురక్షిత నీరు వంటి అంశాలను ప్రభుత్వం తన తాజా కార్యక్రమాల ద్వారా ప్రధానంగా ముందుకు తీసుకువచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper