Tecno Camon 50 Ultra 5G: టెక్నో (Tecno) కంపెనీ నుంచి సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. ప్రీమియం లుక్ తో పాటు ఏఐ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ గురించి సమాచారం ఇప్పటికే లీక్ కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. దీంతో దీనిని దక్కించుకోవడానికి చాలా మంది వినియోగదారులు రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం.. లాంచ్ తేదీ మరియు అమెజాన్ లభ్యత:
Tecno నుంచి Camon 50 Ultra 5G జూలై 17, మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. ఆ తర్వాత దీనిని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్‌తో డిజైన్ చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ‘సిల్క్-ఫ్లో’ డిజైన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్, స్లిమ్ మరియు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ మొబైల్ భారత్‌లో నెబ్యులా టైటానియం , సైప్రస్ గ్రీన్ , మిస్టీ పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. అంతేకాకుండా నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తోంది. 1.5K రిజల్యూషన్ తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్మూత్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అవుట్‌డోర్‌లో స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు.
‘Sees It All’ అనే కాన్సెప్ట్‌తో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫోటోలను అందంగా మార్చే AI Photo Enhancement వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ ఫోన్‌లో రోజంతా ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చేలా 6,500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సినిమా, మ్యూజిక్ లవర్స్ కోసం మెరుగైన సౌండ్ క్వాలిటీని అందించేలా స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు. భారత మార్కెట్లో దీని ఖచ్చితమైన ధర మరియు ఆఫర్ల వివరాలు జూలై 17 లాంచ్ రోజున వెల్లడవుతాయి.
















లెనిన్ మూవీలో అఖిల్ చేసిన తప్పేంటో చెప్పిన మహేష్ బాబు...
Mahesh Babu On Akhil: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. ఇక సినిమాను చూసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ ని సాధించాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ లేదు. దీంతో ఆయన కెరియర్ ఫేడ్ ఔట్ అవ్వబోతుంది ఈ సినిమా తేడా కొడితే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి రాబోతుంది అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్స్ చేశారు.
మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో చాలామంది సినిమా సెలబ్రిటీలు సైతం అఖిల్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. ఇక మహేష్ బాబు సైతం అఖిల్ కి ఫోన్ చేసి యాక్టింగ్ అద్భుతంగా చేశావు అంటూ అతన్ని మెచ్చుకున్నాడట.
దాంతోపాటుగా రా లుక్ లో తన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నప్పటికి కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ రగ్గుడ్ రా నెస్ అనేది అంత ఎఫెక్టివ్ గా రాలేదని అది ఇంకొంచెం బెటర్మెంట్ గా చేసి ఉంటే బాగుండేదని కూడా మహేష్ బాబు అఖిల్ కి చెప్పినట్టుగా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ ను సాధించడంతో అఖిల్ అభిమానులతో పాటు ఎంటైర్ ఇండస్ట్రీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
కారణం ఏంటంటే అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి చాలా ఘన కీర్తి ఉంది. దానిని ముందుకు తీసుకెళ్లే హీరోల్లో నాగ చైతన్య, అఖిల్ ఎంతవరకు ప్రయత్నం చేసిన కూడా వాళ్లకు సరైన సక్సెస్ లు రావడం లేదు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన డిఫరెంట్ ప్రయత్నం చేయడమే కాకుండా ప్రేక్షకులందరిని అలరించాడు. కాబట్టి ఈ సినిమా మొత్తానికైతే సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇక మీదట కూడా ఆయన మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు…