Home Blog Page 2

త్రివిక్రమ్ vs వెట్రీ మారన్.... ఏం జరగబోతుంది...

Trivikram Srinivas
Trivikram Srinivas

Trivikram Srinivas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘గాడ్ ఆఫ్ వార్ ‘ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా తమిళులు చాలా వరకు వ్యతిరేకతను చూపిస్తున్నారు. కారణం ఏంటంటే మా దేవుడి కథను తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు అంటువాళ్లు కొంతవరకు కొన్ని విభేదాలను సృష్టిస్తున్నారు. ఇక దీనికి పోటీగా ఇప్పుడు వెట్రీ మారన్ సైతం ఇలాంటి సినిమానే చేయబోతున్నాను అంటూ ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ధనుష్ ను హీరోగా పెట్టి ఆయన చేయబోయే సినిమా కూడా గాడ్ ఆఫ్ వార్ సినిమా స్టోరీ లాగానే ఉంటుందని చెప్పడంతో త్రివిక్రమ్ కి పెద్ద షాక్ తగిలింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మొదట స్టార్ట్ అవుతుంది.

రెండు సినిమాల కథలు ఏంటి ఎవరెవరు ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు. రెండు సినిమాల కథలు ఒకటే అయితే ఎవరికి ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు కూడా ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద చర్చించుకుని ఎవరి కథకు సంబంధం లేకుండా సినిమాని చేయగలిగితే మంచిది. లేకపోతే మాత్రం వీళ్ళిద్దరూ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది…

అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు రెండు కథలను డిఫరెంట్ సబ్జెక్టులుగా మార్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద ఇద్దరు ఎవరికి వారు మా కథకి దానికి సంబంధం ఉండదు అనుకోవడం కంటే కూడా ఇద్దరు దర్శకులు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఈ రెండు కథల్లో ఏది ముందుగా సెట్స్ మీదకి వెళుతుంది. ఏది ముందుగా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటేస్తారు అనేది తెలియాల్సి ఉంది…

పాపం విరాట్ కోహ్లీకి ప్రశాంతత లేకుండా పోయింది

Virat Kohli
Virat Kohli

Virat Kohli: టీం ఇండియా స్టార్ ఆటగాడిగా.. పరుగుల యంత్రంగా విరాట్ కోహ్లీకి పేరు ఉంది. టీమ్ ఇండియా సాధించిన ఎన్నో విజయాలలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. అతడి నాయకత్వంలో టీమిండియా అగ్రిసివ్ ఆటతీరు మొదలుపెట్టింది. ఎన్నో దేశాల మీద అద్భుతమైన క్రికెట్ ఆడింది. నాయకుడిగా.. ఆటగాడిగా విరాట్ కోహ్లీ.. అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా 2024లో పొట్టి ప్రపంచ కప్ అందుకున్న తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. టీమిండియా కు 2027లో వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తన మకాం మొత్తాన్ని లండన్ నగరానికి షిఫ్ట్ చేశాడు.

భార్య.. పిల్లలతో కొంతకాలంగా విరాట్ కోహ్లీ లండన్ నగరంలోనే ఉంటున్నాడు. ఐపీఎల్ ఆడినప్పుడు.. టీమిండియా స్వదేశంలో మ్యాచులు ఆడినప్పుడు.. ఇంకా ఏమైనా వ్యవహారాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఇండియాకు వస్తున్నాడు. ఇక్కడ పనులు చక్కపెట్టుకొని లండన్ వెళ్లిపోతున్నాడు. లండన్ లోనే విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇండియాలో అతడికి ప్రైవసీ లేకపోవడంతో లండన్ వచ్చాడు. ఇక్కడ కూడా అతడికి ప్రైవసీ లేకుండా పోతుంది.

గాయం నుంచి సాంత్వన పొందిన తర్వాత విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కాక్స్ అనే ఆటగాడు విరాట్ కోహ్లీతో సంభాషణ జరిపాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది..”విరాట్ కోహ్లీ నాతో మాట్లాడాడు. అనేక విషయాలు చెప్పుకున్నాడు. ఇటీవల ఆతులు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు మీడియాలోకి వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లీ ఒక రకమైన అసహనం వ్యక్తం చేశాడు. ఇండియాలోనే కాదు తనకు ఇక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పాడు. హాయిగా తిరిగే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడని” కాక్స్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు అద్బుతంగా ఉంటాయని కాక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

'అయ్యగారు' అని నామకరణం చేసిన ఫ్యాన్ కి అఖిల్ అరుదైన గిఫ్ట్..ఇలా ఏ హీరో చేసి ఉండరు..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అనకాపల్లి నుండి అమెరికా వరకు బంపర్ ఓపెనింగ్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఓపెనింగ్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో టాక్ వస్తుందని అసలు ఊహించలేదని , అఖిల్ ఎట్టకేలకు కుంభస్థలం బద్దలు కొట్టాడని అంటూ అభిమానులు సంతోషం తో చిందులు వేస్తున్నారు. ఇక అఖిల్ నిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లో తీవ్రమైన భావోద్వేగానికి గురై తన తండ్రి అక్కినేని నాగార్జున ని గట్టిగా పట్టుకొని ఏడవడం హైలైట్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.

ఇకపోతే అక్కినేని అఖిల్ ప్రతీ సినిమాకు ఒక అభిమాని బాగా ఫోకస్ అవుతూ ఉంటారు. ‘అయ్యగారే నెంబర్ 1’ అంటూ ఈ అభిమాని చేసే హంగామాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా చెప్పండి?. అఖిల్ కి కూడా ee అభిమాని బాగా సుపరిచితమే. ఒకసారి ఆయన ఈ వీడియో ని చూసి కచ్చితంగా కలుస్తానని కూడా చెప్పారు. కానీ మామూలుగా కలవను , భారీ హిట్ కొట్టిన తర్వాతే కలుస్తాను , అతనితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ‘లెనిన్’ చిత్రం ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ తన వీరాభిమానిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. ఒక అభిమాని కోసం హీరో స్వయంగా రావడం కొన్ని సందర్భాల్లోనే చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భం క్రియేట్ అవ్వనుంది.

ఇక ఆ అభిమానికి ఇంతకు మించిన బహుమతి ఏమి ఉంటుంది చెప్పండి. లెనిన్ చిత్రానికి కూడా ఈ అభిమాని తన తోటి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ని కూడా అఖిల్ చూసారు. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అఖిల్ ఈ అభిమానిని కలిసే రోజు సోషల్ మీడియా లో ఆ వీడియో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ఒకప్పుడు ఈ వీడియో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది , కానీ ఇది ఇప్పుడు అభిమానులకు హై ఇచ్చే మూమెంట్ కాబోతుంది. సక్సెస్ ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

సూర్య వంశీ ని ఆటాడుకుంటున్నారు..ఇదేం ర్యాగింగ్ రా అయ్యా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ అంచనాలకు మించి ఆడటం లేదు. సూపర్ బ్యాటింగ్ చేయడం లేదు. ఐపీఎల్ తరహాలో పరుగుల ప్రవాహం కొనసాగించడం లేదు. ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు.. ఐరిష్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. సూర్య వంశీకి మేనేజ్మెంట్ జట్టులో చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ లో అతనికి అవకాశం వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు.

ఐపీఎల్ లో సూర్య వంశీ పెద్ద పెద్ద బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టాడు. సునాయాసంగా సిక్సర్లు కొట్టాడు. పరుగుల ప్రభావం కొనసాగించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ అదే జోరు ఇంగ్లాండ్ సిరీస్ లో చూపించలేకపోతున్నాడు. ఫోర్ లేదా సిక్సర్ కొట్టి వెంటనే అవుట్ అవుతున్నాడు. పదునైన బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు. అతడి లోపానికి గమనించిన ఇంగ్లీష్ బౌలర్లు.. పదే పదే అదే తరహా బంతులు వేసి అతడిని అవుట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

సూర్యవంశీ కేవలం ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతాడని.. ఇంగ్లీష్ గ్రీన్ పిచ్ ల మీద ఆకట్టుకోలేడని.. అతడికి ఆడ టం సాధ్యం కాదని.. సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ మైదానాల మీద సూర్య వంశీ ఆడే తీరును.. ఇంగ్లీష్ మైదానాల మీద ఆడే తీరును వివరిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. సూర్యవంశీ ఆటతీరు పట్ల దెప్పి పొడిచే విధంగా ఉన్నాయి. ఈ వీడియోలు ఒకవేళ సూర్య వంశీ కంటపడితే ఎలా ఉంటుంది.. ఇటీవల ట్రై సిరీస్లో శ్రీలంక ప్లేయర్లు అతడిని రెచ్చగొట్టారు. దీంతో అతడు రెచ్చిపోయి ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ అభిమానులు సూర్య వంశీ ఆట తీరును ఎగతాళి చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అతడు చివరి టి20 మ్యాచ్లో రెచ్చిపోతే.. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు కనిపిస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో.. సూర్య వంశీ ఫామ్ లోకి వస్తే అలానే ఉంటుందని.. అలాంటప్పుడు అతడిని గెలకకపోవడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

అర్ధరాత్రి మహిళ పిలిచిందని వెళ్లాడు.. ఆ రాత్రి జరిగిన సీన్ చూసి పోలీసుల శరణు కోరాడు

Bihar Marriage
Bihar Marriage

Bihar Marriage: దానికోసం కక్కుర్తి పడకూడదు. అనవసరంగా ఆశపడకూడదు. ఆ తర్వాత జరిగే సంఘటనలు వేరే విధంగా ఉంటాయి. అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు. బాధపడి ప్రయోజనం ఉండదు. పాపం ఆ యువకుడి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. అయినప్పటికీ అక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే జరిగిన సంఘటన అటువంటిది కాబట్టి..

అతనికి 22 సంవత్సరాలు. ఉండేది బీహార్ రాష్ట్రంలో.. ఇతడికి ఒక హాస్పిటల్లో 32 సంవత్సరాల మహిళ పరిచయం అయింది. అప్పటికే ఆమెకు వివాహం జరిగింది. ఒక కుమార్తె కూడా ఉంది. ఒక హాస్పిటల్లో ఆమెతో అయిన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమ దాకా వెళ్ళింది. వారిద్దరు ఆ పని కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఒకరోజు రాత్రి మా ఇంటికి రావాలి అంటూ ఆమె వర్తమానం పంపింది. దీంతో అతడు ఎంతో ఆత్రుతతో అక్కడికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.. ఆమెకు.. అతడికి పెళ్లి చేశారు. స్థానికులను పిలిచి ఈ వేడుకను గ్రాండ్ గా జరిపారు. పెళ్లిరోజు అతడు సానుకూలంగానే ఉన్నాడు. ఆమె పెద్దలు చెప్పినట్టు చేశాడు. కానీ తర్వాత, అతడు పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి పెళ్లి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ఖగారీయా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పెళ్లికి ఆ మహిళ కూతురు కూడా ఒప్పుకోవడం గమనార్హం.

అతడి సమ్మతితోనే పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందులో అతడిని ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని.. వేధింపులకు పాల్పడలేదని.. ఇబ్బంది పెట్టలేదని వారు చెబుతున్నారు. ఇష్టంతో పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కూడా రిటర్న్ కేసు పెడతామని.. పోలీసుల దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తామని ఆ నర్స్ బంధువులు చెబుతున్నారు.

ఈ దసరా బరిలో నిలిచే మూవీస్ ఇవే...

Dasara 2026 Movies
Dasara 2026 Movies

Dasara 2026 Movies: ఇండస్ట్రీ లో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. కారణం ఏంటంటే పండక్కి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒకే చోట కలుసుకుంటారు. దాని వల్ల ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా గడపడానికి ఇష్టపడతారు.తద్వారా అందరు సినిమాలను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దాని కోసమే పండగ సీజన్లో మంచి సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే దసరా పండగకి చాలా పెద్ద సినిమాలను రిలీజ్ చేసి దానిని క్యాచ్ చేసుకోవాలని చాలామంది చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ దసరాకి మాత్రం చాలా పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది. ఇక దాంతోపాటుగా చిరంజీవి విశ్వంభర సినిమా కూడా దసరాకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక రెండు సినిమాలతో పాటు నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాని కూడా దసరా బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు ప్రేక్షకులందరిలో ఎలాంటి గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి అనే వార్తలైతే వస్తున్నాయి. దసరాకి ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో ఈలోపు చిన్న చిన్న సినిమాలను సైతం రంగం సిద్ధం చేసి బరిలో దింపాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలను బరిలో దింపి సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లెనిన్ సినిమాతో ఇండస్ట్రీ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు రోజులపాటు ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరగడానికి కారణం ఇదే...

Tollywood Trends
Tollywood Trends

Tollywood Trends: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది… ప్రస్తుతం 80,90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఆ సెటప్ ని బాగా వాడుకుంటున్నారు. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి తరహా సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు సైతం ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోల సినిమాలు మొత్తం 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే కావడం విశేషం…రంగస్థలం నుంచి మొన్న వచ్చిన పెద్ది వరకు అన్ని సినిమాలు 80స్ 90స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సక్సెస్ లు కూడా భారీగానే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మేకర్ కూడా దానినే అనుసరిస్తున్నాడు.

నిజానికి ఆ టైమ్ పిరియడ్ లో ఉన్న మనుషులు ఎలాంటి వారు అక్కడ ఉండే పరిస్థితులు ఎలాంటివి రాజకీయం ఎలాంటి రంగులు అలుముకునేది అనే విషయాలను కూడా చూపిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో దర్శకులు సక్సెస్ అవుతున్నారు.

కాబట్టే ఇది సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సైతం ఆ సక్సెస్ ఫార్ములాను పాటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇంకా ఎన్ని రోజులపాటు ఈ 80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి కథలు రాబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాలతో సక్సెస్ ను సాధించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు…

హవ్వా.. చెరువులే ఓవైసీ కాలేజీకి దగ్గరకొచ్చాయట.. అంతా సక్రమమేనట..

Owaisi College Controversy
Owaisi College Controversy

Owaisi College Controversy: అంతా సక్రమమే. అక్రమం లేదు.. చెరువులు ఆక్రమించలేదు. చెరువులే ఏకంగా ఓవైసీ కాలేజీలకు వెళ్లాయి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ కాలేజీలకు ఇచ్చిన క్లియరెన్స్.. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ ఖల్సా ప్రాంతంలో సల్కం చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మించిన బారిష్టర్ ఫాతిమా ఓవేసి ఎడ్యుకేషన్ క్యాంపస్ పై కొంతకాలంగా వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. హైడ్రా ఈ కాలేజీ ని పడగొట్టాలని.. సల్కం చెరువు పరిధిలో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కొద్ది రోజులుగా బిజెపి నాయకులు.. భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేదల విషయంలో దూకుడుగా పని చేసే హైడ్రా.. ఓవైసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఒక కీలక సమాచారాన్ని ఇచ్చారు. సల్కం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి అనధికారిక నిర్మాణాలు లేవని.. గతంలో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసినప్పుడు.. ఈ చెరువు చుట్టూ రింగ్ బండ్ కూడా నిర్మించామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో హైకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ వాదనలో అస్పష్టత ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జల వనరులను కాపాడటం.. ఎఫ్ టి ఎల్ పరిధులను నిర్ణయించడం ప్రభుత్వ బాధ్యత అని.. అలాంటప్పుడు జిల్లా కలెక్టర్ ఇంతవరకు తుది నివేదిక ఎందుకు ఇవ్వలేదని.. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లో మ్యాప్ ఎందుకు అప్లోడ్ చేయలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కాలేజీని నడిపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంస్థకు చెందిన భవనాన్ని కూల్చి వేయడానికి కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ భవనం కూల్చివేత పై హైకోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని ఉపసంహరించుకుంది.. ఈ అంశం మీద వేరువేరు బెంచ్ లు సమాంతరంగా విచారణ సాగించడంతో.. విరుద్ధమైన తీర్పులు వస్తాయని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన కూల్చివేతలను సాలార్ ట్రస్ట్ సవాల్ చేసింది.. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సల్కం చెరువు ఆక్రమణలపై ప్రధాన పిల్ కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో.. దానికి అనుబంధంగా దీనిని జత చేయాలని రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

హైకోర్టు ఇచ్చిన తీర్పులో మరొక కీలకమైన అంశం ఎక్కడ తెలుగులోకి వచ్చింది.. చెరువులను రక్షించే అధికారం హైడ్రాకు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు.. కొన్ని చెరువులను మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారని.. మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవడంలేదని హైడ్రాను ప్రశ్నించింది. హైడ్రా యంత్రాంగం రాజకీయ నేతల ఒత్తిడికి తలవంచడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే సంకేతాలు ప్రజలలోకి వెళ్తున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఓవైసీ కాలేజీ విషయంలో విద్యాశాఖ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

2017లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఈ భూమి మీద ఆకులు పొందామని చెబుతోంది. అలాంటప్పుడు ఈ ట్రస్ట్ 2016 లోనే భవన క్రమబద్ధీకరణ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకుందని హైకోర్టు ముందు పిటిషనర్ విజయ్ గోపాల్ సరికొత్త ప్రశ్న అందించారు. భూకబ్జా కోణం ఉందని.. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ సాగించాలని ఆయన కోరారు. ఈ కేసు విచారణలో ఈనెల 30 కి కోర్టు వాయిదా వేసింది. ఈ కాలేజీ ని ఎఫ్ టి ఎల్ పరిధిలోని లేదని ప్రభుత్వం చెప్పడం.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు తదుపరి దశలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

లంచం అడిగితే నా పేరు చెప్పండి : సీఎం విజయ్‌ సంచలనం

CM Vijay
CM Vijay

CM Vijay: దళపతి విజయ్‌.. సినిమా హీరోగా సౌత్‌ ఇండియా ప్రజలకు సుపరిచితం. తన అవినీతి, అక్రమాలు, రౌడీయిజంపై పోరాడే అనేక సినిమాల్లో నటించారు. పోలీస్‌ ఆఫీజర్లుగా పొలిటికల్‌ రౌడీల భరతం పట్టారు. కోట్ల మంది అభిమానులు ఉన్న దళపతి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. వివిధ పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. విజయ్‌ సీఎం అయ్యారు. రెండు నెలల్లో పాలనలోనపూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. ఎవరైనా లంచం అడిగితే ఇవ్వవద్దని, తమ చట్టబద్ధమైన పనులు జరిగేలా తాను చూస్తానని స్పష్టం చేశారు.

నేనున్నానంటూ ధీమా..
సీఎం విజయ్‌ చెప్పిన మాటలు ప్రజలకు ధీమా కల్పించడంతోపాటు అవినీతి అధికారులకు ఒక హెచ్చరిక. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి చేసే ప్రయత్నం. లంచం అడిగే వారికి ప్రజలు ‘‘లేదు’’ అని చెప్పడం ద్వారా అవినీతి చక్రం ఆగిపోతుందని ఆయన అభిప్రాయం. అలాగే, పనులు ఆపడానికి ఎవరు ప్రయత్నించినా వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పడం ద్వారా ప్రభుత్వ నాయకత్వం బలంగా నిలబడుతుందని సూచిస్తున్నారు.

ప్రజల హక్కులను కాపాడేలా..
ఈ సందేశం ప్రజలను కేవలం బాధితులుగా చూడకుండా లంచం ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా ప్రజలు తమ హక్కులను కాపాడుకోవచ్చు. అయితే ఇది సులభం కాదు. చాలా మంది భయపడి లేదా పని త్వరగా పూర్తి చేయాలని లంచం ఇచ్చేస్తారు. సీఎం విజయ్‌ ఇలా చెప్పడం ద్వారా ప్రజలకు ధైర్యం కలిగించి, వారి బాధ్యతను కూడా నొక్కి చెప్పారు.

ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతకు..
తమిళనాడు సీఎం విజయ్‌ ప్రకటన ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి అంశాలపై నేరుగా దాడి చేస్తుంది. లంచం అడిగే అధికారులు లేదా మధ్యవర్తులు ఈ సందేశం విన్న తర్వాత ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. పనులు ఆపకుండా ముందుకు తీసుకెళ్లేలా చూడాలని సీఎం చెప్పడం వల్ల దిగువ స్థాయి అధికారులు మరింత జాగ్రత్తగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మాటలతో మాత్రమే సాధ్యం కాదు. వాస్తవికంగా అమలు జరగాలి.

ఈ సందేశం ఎఫెక్ట్‌..
సీఎం విజయ్‌ ఇచ్చిన ఈ సందేశం అవినీతి నిరోధం దిశగా ఒక మంచి ప్రారంభం. ఇది ప్రజలలో అవగాహన పెంచి, ప్రభుత్వంపై నమ్మకం పెంచే అవకాశం ఉంది. అయితే వాస్తవంలో అమలు చేయడం సులభం కాదు. లంచం అడిగిన వారిపై చర్యలు తీసుకోవడం, పనులు ఆలస్యం కాకుండా చూడడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం వంటి వ్యవస్థాగత మార్పులు అవసరం. ఈ సందేశం కేవలం ప్రచారానికి మాత్రమే మిగిలిపోతే, ప్రజలలో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు, నిజంగా అమలు జరిగితే అది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారవచ్చు. అవినీతి నిరోధం మాటలతో కాకుండా, ప్రజల సహకారం, వ్యవస్థాగత సంస్కరణలతోనే సాధ్యమవుతుంది. సీఎం విజయ్‌ ఇచ్చిన ఈ సవాల్‌ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

విష్ణు ఆలయంలో నవగ్రహాలు ఎందుకు ఉండవు..

Navagrahas
Navagrahas

Navagrahas: హిందూ ధర్మంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులందరినీ కలిపి నవగ్రహాలుగా పిలుస్తారు. ఈ నవ గ్రహాలు మనుషుల జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే అనేక దేవాలయాల్లో నవగ్రహ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు వీటికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పురాతన విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు కనిపించవు. కానీ ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న అనేక విష్ణు ఆలయాల్లో నవగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నవగ్రహాలు విష్ణు ఆలయాల్లో ఎందుకు కనిపించవు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మ సమయంలో గ్రహాల స్థానాన్ని బట్టి జీవితంలో శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయని విశ్వాసం. గ్రహదోషాలు, శని ప్రభావం, రాహు-కేతు దోషాలు, కుజదోషం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నవగ్రహాలను ఆరాధిస్తారు. గ్రహాలను దేవతల ప్రతినిధులుగా భావించి, వారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, వివాహం, సంతానం, ఉద్యోగం వంటి విషయాల్లో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం నవగ్రహాలు స్వతంత్ర పరబ్రహ్మ స్వరూపాలు కాదు. ఇవి భగవంతుని ఆజ్ఞలను అమలు చేసే దైవశక్తులు. సృష్టిలో కర్మఫలాలను అందించే బాధ్యతను వీరికి అప్పగించారని పురాణాలు వివరిస్తాయి. అందువల్ల నవగ్రహాలను గౌరవించి పూజించినప్పటికీ, పరమాత్మ కంటే ఉన్నతస్థానంలో ఎప్పుడూ ఉంచరు.

విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉండవు?
ప్రాచీన వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువే జగన్నియంత. నవగ్రహాలతో సహా సమస్త లోకాలు, దేవతలు, కాలం అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయని విశ్వాసం. అందువల్ల విష్ణు ఆలయంలో శ్రీమహావిష్ణువును దర్శిస్తే నవగ్రహాలను ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదని వైష్ణవ ఆగమాలు పేర్కొంటాయి. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీరంగం, మేల్కోటె వంటి ప్రసిద్ధ ప్రాచీన వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక నవగ్రహ మండపాలు కనిపించవు.

విష్ణు పురాణం, భాగవతం వంటి గ్రంథాల్లో సూర్యుడు సహా అన్ని గ్రహాలు శ్రీమహావిష్ణువు నియమించిన విధంగానే తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయని వివరించబడింది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తే గ్రహదోషాల ప్రభావం కూడా తగ్గుతుందని వైష్ణవ ఆచార్యులు వివరిస్తారు. అందుకే వైష్ణవ భక్తులు నవగ్రహాల కంటే నారాయణుడి శరణాగతినే ప్రధానంగా భావిస్తారు.

శివాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?
శైవ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ముఖ్యంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణాల్లో నవగ్రహ మండపం ఒక సాధారణ భాగంగా మారింది. శివుడిని నవగ్రహాలకు అధిపతిగా భావిస్తూ, భక్తులు శివదర్శనంతో పాటు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేస్తారు. అందువల్ల శివాలయాల్లో నవగ్రహ విగ్రహాలు విస్తృతంగా కనిపిస్తాయి.

ప్రస్తుతం విష్ణు ఆలయాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
ఇటీవలి దశాబ్దాల్లో నిర్మిస్తున్న అనేక విష్ణు ఆలయాల్లో కేవలం విష్ణువు మాత్రమే కాకుండా ఇందులో ఉప ఆలయాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నవగ్రహ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతక దోష నివారణ పూజలు, శని శాంతి, రాహు-కేతు పూజలు, నవగ్రహ హోమాలు చేయాలనే భక్తుల కోరికలను తీర్చేందుకు దేవాలయ నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయమే తప్ప, ప్రాచీన వైష్ణవ ఆగమ సంప్రదాయంలో తప్పనిసరి అంశం కాదు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 3 గంటల పాటు జరిగిన సర్జరీ.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Pawan Kalyan Shoulder Surgery
Pawan Kalyan Shoulder Surgery

Pawan Kalyan Shoulder Surgery: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేడు ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. గత కొంత కాలం నుండి తన రెండు భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్స్ నొప్పి తో ఇబ్బంది పడుతున్నారు. వాటికి తగిలిన గాయాల నొప్పి తీవ్రవటం అవ్వడంతో , డాక్టర్లు సర్జరీ అత్యవసరమని రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సూచించారు. అయితే అప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడి ఉండడం తో , వాటిని పూర్తి చేసుకొని వస్తానని డాక్టర్లకు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అవన్నీ పూర్తి అవ్వడం తో నిన్న శుక్రవారం రోజున ఆయన సర్జరీ కోసం ముంబై కి వెళ్లారు.

రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు.ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు.

ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.

కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు

Tamannah Bhatia
Tamannah Bhatia

'లెనిన్' పై నాగ చైతన్య పోస్ట్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అక్కినేని అఖిల్..

Naga Chaitanya
Naga Chaitanya

Naga Chaitanya: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు దాటింది , ఇప్పటి వరకు అఖిల్ కి ఆడియన్స్ నుండి ఈ రేంజ్ పబ్లిక్ టాక్ ఉన్నటువంటి సినిమా రాలేదు. మొదటిసారి అలాంటి చిత్రం రావడంతో , బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఓపెనింగ్స్ ని చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఇన్నేళ్లు వృధా అయినా అఖిల్ స్టామినా తలచుకొని బాధపడుతున్నారు. ఈ రేంజ్ స్టామినా పెట్టుకొని కూడా అఖిల్ మంచి సినిమాలు చేయలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ సినిమా పై అక్కినేని నాగచైతన్య వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.

నిన్న సాయంత్రం ఆయన ఒక ట్వీట్ వేస్తూ , ‘కష్టపడితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి లెనిన్ ఒక నిదర్శనం. ఈ చిత్రానికి వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడి అద్భుతమైన నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యినందుకు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ ఒక ట్వీట్ వేశారు నాగ చైతన్య. దీనికి అఖిల్ సమాధానం చెప్తూ ‘థాంక్యూ అన్నయ్యా.. మీకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఆనందం తో కంటతడి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అఖిల్ , నాగ చైతన్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని చాలా రోజుల నుండి ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది. అంతే కాదు , ఈ ఇద్దరి హీరోల అభిమానులు నిత్యం సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ కూడా చేసుకుంటూ ఉంటారు.

ఇక నిన్న సక్సె సెలబ్రేషన్స్ లో నాగ చైతన్య కనిపించకపోయేసరికి , అక్కినేని ఫ్యాన్స్ నిజంగానే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయేమో అని అనుకున్నారు. కానీ నేడు ట్వీట్స్ రూపం లో వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాత చూసిన తర్వాత అభిమానులు అవన్నీ రూమర్స్ ని ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే లెనిన్ చిత్రానికి మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.

మల్లారెడ్డినా మజాకా.. ఏకంగా మోహన్ బాబుతోనే ఢీ..

Malla Reddy University
Malla Reddy University

Malla Reddy University: పూలమ్మినా… పాలమ్మినా.. కాలేజీ పెట్టినా.. అంటూ తనదైన శైలి ప్రంగం.. వివిధ కార్యాక్రమాల్లో ఉత్సాహ పరిచే వ్యక్తిత్వంతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు చామకూర మల్లారెడ్డి. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తన విద్యాసంస్థల ద్వారా మల్లారెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంది. ఇంతకాలం తెలంగాణకే పరిమితమైన తన విద్యాసంస్థలను ఇక ఏపీకి విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి సాధించారు. యూజీసీ చట్టం ప్రకారం ఈ ఆఫ్‌–క్యాంపస్‌ విశ్వవిద్యాలయం స్థాపనకు గెజెట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో విద్యా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.

రేణిగుంట పరిధిలో క్యాంపస్‌ నిర్మాణం
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో ఈ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇంతకుముందే ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్‌ కళాశాలను కొనుగోలు చేసి, దానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి, కేంద్ర నియమాలకు అనుగుణంగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ప్రాజెక్ట్‌ వేగంగా ముందుకు సాగుతోంది.

తెలంగాణలో విస్తృతమైన విద్యా నెట్‌వర్క్‌..
తెలంగాణలో మైసమ్మగూడ వద్ద లక్షలాది విద్యార్థులకు చదువు అందిస్తున్న మల్లారెడ్డి సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టడం ద్వారా రాయలసీమ విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య విద్యా సహకారానికి మార్గం సుగమం చేస్తుంది.

ఆధునిక కోర్సులు, పరిశోధనా కార్యక్రమాలు

రాబోయే విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు, పరిశోధనా కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్‌ సైన్స్, ఏఐ, డేటా సైన్స్‌ వంటి సాంకేతిక విభాగాలు, నిర్వహణ రంగంలోని అధ్యయనాలకు సీట్లు భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా తిరుపతి..
తిరుపతిలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ వంటి జాతీయస్థాయి సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రేణిగుంట పరిసరాల్లో పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఈ కొత్త డీమ్డ్‌ విశ్వవిద్యాలయం రావడంతో ఆ ప్రాంతం విద్యా కేంద్రంగా మరింత బలపడనుంది. మోహన్‌ బాబు స్థాపించిన విశ్వవిద్యాలయం ఆధిపత్యానికి మల్లారెడ్డి యూనివర్సిటీతో చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.

ఒరిజినల్ పాన్ ఇండియా హీరో అతనే...

Original Pan India Hero
Original Pan India Hero

Original Pan India Hero: ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న హీరోలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు ఉంది. వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు వాళ్ళు చేసిన చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న సందర్భంలో అసలైన పాన్ ఇండియా హీరో ఎవరు అనేదాని మీదనే తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అసలైన పాన్ ఇండియా హీరో ఎవరు అంటే ప్రభాస్ అని చెబుతున్నారు. కారణం ఏంటి అంటే ఆయన బాహుబలి సినిమాతో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసిన హీరో కూడా తనే కావడం విశేషం…

అందువల్లే ఆయన పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా ప్రేక్షకులందరిని ఆయన సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…

ఇక ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ప్రభాస్ ఈ సంవత్సరం చేసిన ‘రాజాసాబ్’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. అయినప్పటికి ఆయన క్రేజ్ అయితే తగ్గలేదు. ఇక రాబోయే సినిమాలతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే అతని లైనప్ అ చాలా బాగుంది.

ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తుండటం విశేషం…

ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా..

TRAI Rules
TRAI Rules

TRAI Rules: మొబైల్ వినియోగదారులకు వచ్చే ప్రమోషనల్, సర్వీస్ కాల్స్ విషయంలో భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) కీలక స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా RBI, SEBI, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసే అధికారిక కాల్స్‌తో పాటు ప్రకటనల కోసం ఉపయోగించే ప్రత్యేక నంబర్ సిరీస్‌లపై థర్డ్ పార్టీ కాల్ బ్లాకింగ్ యాప్స్‌కు పరిమితులు ఉంటాయని వెల్లడించింది. దీంతో వినియోగదారులు ఏ కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు? ఏవాటిని చేయలేరు? అనే అంశంపై స్పష్టత వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితె..

TRAI ప్రకారం.. RBI, SEBI, బ్యాంకులు, బీమా సంస్థలు ఇతర నియంత్రిత ఆర్థిక సంస్థలు వినియోగదారులకు చేసే అధికారిక సేవా కాల్స్ కోసం 1600 సిరీస్ నంబర్లను కేటాయించారు. ఈ కాల్స్‌ను Truecaller వంటి థర్డ్ పార్టీ కాల్ ఐడెంటిఫికేషన్ లేదా స్పామ్ బ్లాకింగ్ యాప్స్ స్పామ్‌గా ట్యాగ్ చేయడం లేదా పూర్తిగా బ్లాక్ చేయడం సాధ్యం కాదని ట్రాయ్ పేర్కొంది. ప్రజలకు ముఖ్యమైన బ్యాంకింగ్, భద్రతా, లావాదేవీల సమాచారాన్ని అందించడమే ఈ నంబర్ల ఉద్దేశమని తెలిపింది.

ప్రమోషనల్ కాల్స్.. ప్రకటనల కోసం ఉపయోగించే 140 సిరీస్ నంబర్ల విషయంలో కూడా థర్డ్ పార్టీ యాప్స్‌కు పరిమితులే ఉంటాయని ట్రాయ్ తెలిపింది. ఈ కాల్స్‌ను యాప్స్ తమ ఇష్టానుసారంగా ఫిల్టర్ చేయడం లేదా పూర్తిగా నిరోధించడం వీలుకాదని స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులు ఈ కాల్స్‌ను ఆపాలంటే అధికారిక మార్గాన్నే అనుసరించాల్సి ఉంటుంది.

అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, SMSలను నిలిపివేయాలనుకునే వినియోగదారులు Do Not Disturb (DND) సేవను తప్పనిసరిగా ఉపయోగించాలని ట్రాయ్ సూచించింది. టెలికాం కంపెనీలు అందించే DND సేవలో నమోదు చేసుకుంటే అవసరం లేని మార్కెటింగ్ కాల్స్, సందేశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొంది. అధికారిక నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్పామ్‌గా భావించి నిర్లక్ష్యం చేయవద్దని ట్రాయ్ సూచించింది. బ్యాంకు లావాదేవీలు, OTPలు, మోసాల హెచ్చరికలు, KYC, పెట్టుబడులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ నంబర్ల ద్వారా రావచ్చని తెలిపింది. అయితే కాల్‌లో వ్యక్తిగత వివరాలు, OTPలు, PINలు అడిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

1600 లేదా ఇతర అధికారిక నంబర్‌లా కనిపించే కాల్ వచ్చినా, ఎవరైనా OTP, బ్యాంక్ పాస్‌వర్డ్, ATM PIN లేదా ఇతర గోప్యమైన వివరాలు అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. అనుమానం ఉంటే కాల్‌ను నిలిపివేసి నేరుగా సంబంధిత బ్యాంకు లేదా సంస్థ అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

టీమిండియాలోకి సరైనోడు వచ్చాడు.. ఇంగ్లాండ్ కు ఇక సావే..

India vs England
India vs England

India vs England: టి20 సిరీస్ కోల్పోయింది. నేడు చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా ఆడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుస ఓవటములకు చెక్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అందువల్లే జట్టులో అనేక రకాల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్ మొదలుపెడుతుంది.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీని.. రోహిత్ శర్మను ఎంపిక చేసింది. వారిద్దరు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు. కొంతకాలంగా విరాట్ ఇంగ్లాండ్లోనే తన కుటుంబంతో ఉంటున్నాడు. కెప్టెన్ గిల్ కూడా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు వింబుల్డన్ పోటీలను ఆస్వాదిస్తున్నాడు. టీమిండియాలో మిగతా ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు. వీరిలో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇటీవల బరువు తగ్గాడు. మైదానంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. ఇటీవలి వన్డే సిరీస్ లో టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ గడ్డమీద అతడు అద్భుతంగా ఆడతాడని.. గత రికార్డులను అధిగమిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

టీమిండియా వరుసగా రెండో టి20 సిరీస్లను కోల్పోయిన నేపథ్యంలో.. పోయిన ఆ పరువును ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ దక్కించుకోవడం ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు అంటే వీరోచితంగా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి జట్టులో చోటు కల్పించడం ద్వారా.. ముందుగానే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ హెచ్చరికలు పంపింది. దీనికి తోడు ఇంగ్లాండ్ పిచ్ ల మీద విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా అతడు అదే పనిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ కూడా అతడికి పూర్తిస్థాయిలో సహకారం అందించింది. దీంతో అతడు ఒకప్పటి మాదిరిగా పరుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఒక ఆట ఆడుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంగ్లాండ్ మీద సిరీస్ ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.