Homeఆంధ్రప్రదేశ్‌Nara Brahmani : నారా బ్రాహ్మణి.. మోస్ట్ పవర్ఫుల్ విమెన్.. బాబు, లోకేష్ ఏమోషనల్

Nara Brahmani : నారా బ్రాహ్మణి.. మోస్ట్ పవర్ఫుల్ విమెన్.. బాబు, లోకేష్ ఏమోషనల్

Nara Brahmani : మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వ్యక్తి. నాన్న తెలుగు సినిమా రంగంలో కీలకమైన కథానాయకుడు.. భర్త ఏపీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి.. అత్త హెరిటేజ్ ఫుడ్స్ చైర్ పర్సన్.. ఇలా ఎటు చూసుకున్నా సరే బలమైన ఆర్థిక నేపథ్యం.. అంతకుమించిన కుటుంబం ఆమె సొంతం.. అయినప్పటికీ ఆమె పనిచేయడం మానలేదు. ప్రయోగాలు చేయడం వదులుకోలేదు. చివరిగా ఆమె మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లాగా అవతరించింది. ఏకంగా […]

Nara Brahmani : మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వ్యక్తి. నాన్న తెలుగు సినిమా రంగంలో కీలకమైన కథానాయకుడు.. భర్త ఏపీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి.. అత్త హెరిటేజ్ ఫుడ్స్ చైర్ పర్సన్.. ఇలా ఎటు చూసుకున్నా సరే బలమైన ఆర్థిక నేపథ్యం.. అంతకుమించిన కుటుంబం ఆమె సొంతం.. అయినప్పటికీ ఆమె పనిచేయడం మానలేదు. ప్రయోగాలు చేయడం వదులుకోలేదు. చివరిగా ఆమె మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లాగా అవతరించింది. ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు సంపాదించింది.

ఈ స్థాయిలో ఘనత సాధించిన ఆమె పేరు నారా బ్రాహ్మణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లో అత్యంత కీలకమైన డెయిరీ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. రైతులతో మమేకం కావడం.. నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించడం.. వినియోగదారుల మనసు చూరగొనడం.. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ ను అత్యున్నత స్థాయిలో నిలిపారు. ఫలితంగా ఈ కంపెనీ మరిన్ని లాభాలను సాధిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తమిళనాడు.. కర్ణాటకలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తూ మరింత మార్కెట్ సొంతం చేసుకుంటున్నది. దీని వెనక నారా బ్రాహ్మణి కృషి ఉంది. ఆమె ప్రణాళికలు.. భవిష్యత్తు లక్ష్యాలు హెరిటేజ్ కంపెనీని అత్యున్నత స్థాయిలో నిలిపాయి.

రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు.. వినియోగదారులకు లభిస్తున్న నాణ్యమైన పాలు.. మిగతా అంశాలు నారా బ్రాహ్మణి లో ఉన్న అసలు సిసలైన వ్యాపారవేత్తను కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆమె నాయకత్వ పటిమను గుర్తించిన ఫార్చ్యూన్ ఇండియా.. నారా బ్రాహ్మణిని ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా ఎంపిక చేసింది. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను బలోపేతం చేయడం.. రైతులతో సాగిస్తున్న ప్రయాణం.. వారితో పెంచుకున్న బంధం.. పాల ఉత్పత్తిలో చేస్తున్న ఆవిష్కరణలు.. ఇవన్నీ కూడా నారా బ్రాహ్మణి ని నాయకత్వ పటిమకు నిదర్శనాలని భావించిన ఫార్చ్యూన్.. ఆమెకు 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో చోటు కల్పించింది. బ్రాహ్మణి ఈ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఇటువంటి పురస్కారాలు మరిన్ని సాధించాలని కోరారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper