Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సినిమాలను చేయడమే కాకుండా అవకాశం దొరికిన ప్రతిసారి క్రికెట్ ఆడుతూ క్రికెట్ అంటే వాళ్లకు ఎంత ఇష్టమో చెబుతుంటారు. ఇక సిసిఎల్ మ్యాచ్లో సైతం తెలుగు వారియర్స్ టీమ్ కప్ గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇండస్ట్రీకి క్రికెట్ కి మధ్య అవినాభావ సంబంధం ఉందనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది క్రికెటర్లు మన హీరోలతో పాటు కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది లెజెండరీ క్రికెటర్లకు సంబంధించిన బయోపిక్ లను సైతం హీరోలు సినిమాలుగా చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిని క్రికెట్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ తో పోలిస్తే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ టి20 టీమ్ కి సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ గా తను గొప్ప డెసిజన్ అయితే తీసుకుంటున్నాడు.
ఇక ఈ విషయంలో ప్రభాస్ ని మనం సూర్యకుమార్ యాదవ్ తో పోల్చవచ్చు… అలాగే సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి వివాదాలు కూడా పెట్టుకోడు. కాబట్టి ప్రభాస్ తో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు… ఇక అభిషేక్ శర్మ లాంటి దూకుడుగా ఉంటూ అనుకున్న దానికోసం ఏదైనా చేయగలిగే కెపాసిటి ఉన్న ప్లేయర్ కావడంతో అల్లు అర్జున్ ను అతనితో పోల్చవచ్చు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు… ఇక ఇషాన్ కిషన్ కి రామ్ చరణ్ సరిగ్గా సెట్ అవుతాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సైతం మంచి దూకుడు మీదున్నాడు. ఇప్పుడు పెద్ది సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు… ఇక హార్థిక్ పాండ్యా తో మహేష్ బాబుని పోల్చవచ్చు. ఎందుకంటే పాండ్యా తన స్టైలిష్ ఇన్నింగ్స్ తో గేమ్ కి ఒక కొత్త అందాన్ని తీసుకొస్తాడు.
అలాగే మహేష్ బాబు సైతం నా అందంతో అభినయం తో సినిమాని ఒంటిచేత్తో సక్సెస్ తీరాలకు తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న హీరో… ఇక రింకు సింగ్ తో జూనియర్ ఎన్టీఆర్ ను పోల్చవచ్చు… మొత్తానికైతే టీమ్ లో ఉన్న టాప్ బ్యాట్స్ మెన్స్ తో టాప్ హీరోలను పోల్చడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…