Homeఎంటర్టైన్మెంట్NTR Neel Movie Overseas Rights: 50 శాతం షూటింగ్ కూడా అవ్వలేదు..అప్పుడే ఆకాశాన్ని...

NTR Neel Movie Overseas Rights: 50 శాతం షూటింగ్ కూడా అవ్వలేదు..అప్పుడే ఆకాశాన్ని అంటుతున్న #NTRNeel బిజినెస్!

NTR Neel Movie Overseas Rights: ప్రస్తుతం #NTRNeel మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా పూర్తి అవ్వలేదు. అయినప్పటికీ మార్కెట్ లో డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. కళ్ళు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ 100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. […]

NTR Neel Movie Overseas Rights: ప్రస్తుతం #NTRNeel మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా పూర్తి అవ్వలేదు. అయినప్పటికీ మార్కెట్ లో డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. కళ్ళు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ 100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అయితే కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ నార్త్ అమెరికా నుండి 6.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అదే విధంగా ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘సలార్’ నార్త్ అమెరికా నుండి 8 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది.

ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక లో తెరకెక్కుతున్న #NTRNeel చిత్రానికి ఓవర్సీస్ మొత్తానికి కలిపి 55 కోట్ల రూపాయిల ఆఫర్ ని ఇస్తున్నారట బయ్యర్స్. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని పొందాలంటే కేవలం ఓవర్సీస్ నుండి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. #RRR , పుష్ప 2 చిత్రాల తర్వాత ఆ రేంజ్ బిజినెస్ ఆఫర్ ఈ చిత్రానికే వచ్చింది. కానీ మేకర్స్ ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఇంతకు అమ్ముడుపోతుంది అనేది. పైన చెప్పిన ప్రైజ్ కి కేవలం నార్త్ అమెరికా లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 12 మిలియన్ డాలర్ల గ్రాస్ రావాలి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుండి కల్కి, బాహుబలి సిరీస్, #RRR మరియు పుష్ప 2 తప్ప మరో సినిమా 12 మిలియన్ డాలర్ల మార్కుని దాటలేదు.

అయితే ఇదంతా అడ్వాన్స్ బేసిస్ మాత్రమే జరుగుతుందట. అంటే బయ్యర్స్ కి జీరో రిస్క్. వాళ్ళు కమిట్ అయిన దాంట్లో కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇస్తారు. 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఆ చిత్రం దాటితే బ్యాలన్స్ అమౌంట్ తో కలిపి, వచ్చిన లాభాల్లో కొంత వాటాలు తీసుకొని ఇస్తారు. అదే ఆ చిత్రం 55 కోట్ల షేర్ ని రాబట్టాలంటే నిర్మాతనే తిరిగి బయ్యర్ కి డబ్బులు ఇవ్వాలి. రాజాసాబ్ కి కూడా ఈ బేసిస్ మీదనే బిజినెస్ చేశారు. ఈ సినిమా నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ వేల్యూ అక్షరాలా 7.2 మిలియన్ డాలర్లు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి కేవలం రెండు మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. మిగిలిన 5.2 మిలియన్ డాలర్లు నిర్మాత కొంత రీకవరీ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. #NTRNeel కి జరిగిన బిజినెస్ కూడా అలాంటిదే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper