Homeఅంతర్జాతీయంTarique Rahman comeback: యూనస్‌ పోయి తారీఖ్‌ వచ్చే.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌!

Tarique Rahman comeback: యూనస్‌ పోయి తారీఖ్‌ వచ్చే.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌!

Tarique Rahman comeback: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో 18 నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలన తర్వాత ఆపద్ధర్మ ప్రధాని మహ్మద్‌ యూనస్‌ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగాయి. 13న ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాల్లో బీఎన్‌పీ మిత్రపక్షాలతో కలిపి 208–212 సీట్లు గెలుచుకుంది. జమాత్‌–ఏ–ఇస్లామీ బంగ్లాదేశ్‌ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి 70 సీట్లు గెలిచాయి. తారాఖ్‌ ప్రధానిగా […]

Tarique Rahman comeback: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో 18 నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలన తర్వాత ఆపద్ధర్మ ప్రధాని మహ్మద్‌ యూనస్‌ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగాయి. 13న ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాల్లో బీఎన్‌పీ మిత్రపక్షాలతో కలిపి 208–212 సీట్లు గెలుచుకుంది. జమాత్‌–ఏ–ఇస్లామీ బంగ్లాదేశ్‌ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి 70 సీట్లు గెలిచాయి. తారాఖ్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, యూఏఈ, మలేషియా, చైనా, నేపాల్, భారత్‌ సహా 13 దేశాలకు ఆహ్వానాలు పంపారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఇస్లామిక్‌ కూటమి ఆధిపత్యం
భారత–బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాలైన సిల్హెట్‌ (13.1% హిందుజనాభా), రంపూర్‌ (13.1%), కల్నాలో (11.5%)లో హిందుజనాభా 10% మించి ఉన్నప్పటికీ, జమాత్‌–ఏ–ఇస్లామీ కూటమి అన్ని సీట్లు కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన మ్యాప్‌లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇస్లామిక్‌ పార్టీలు బలపడ్డాయి.

భారత్‌కు సవాళ్లే..
బీఎన్‌పీ గత చరిత్ర భారత వ్యతిరేకతతో కూడుకుని ఉంది, ఇప్పుడు యాంటీ–ఇండియా, యాంటీ–హిందూ శక్తులతో కలిసి అధికారంలోకి వస్తున్నాయి. హిందుజనాభా 24% నుంచి 8%కి పడిపోయిన దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో మతోన్మాద విజయం భారతదేశంలో జనాభా అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది. రానున్న రోజుల్లో హిందువులపై దాడులు, గోవుల అపహరణలు, సిలిగురి–సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper