Homeఅంతర్జాతీయంTurkey Shocked Pakistan: పాకిస్తాన్‌కు షాకిచ్చిన టర్కీ.. నట్టేట ముంచేసింది..

Turkey Shocked Pakistan: పాకిస్తాన్‌కు షాకిచ్చిన టర్కీ.. నట్టేట ముంచేసింది..

Turkey Shocked Pakistan: ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇవి నాటో తరహా కూటమిగా ఏర్పడేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌కు ఇస్లామిక్‌ నాటో అవసరమైంది. ఈమేరకు చాలా దేశాలతో పాకిస్తాన్‌ సంప్రదింపులు జరిపింది. కానీ ఇస్లామిక్‌ నాటో కొలిక్కి రావడంలేదు. ఈ క్రమంలో సౌదీ అరేబియా, టర్కీతో పాకిస్తాన్‌ డిఫెన్స్‌ డీల్‌ చేసుకుంది. మూడు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఇస్లామిక్‌ నాటోకు అడుగు పడినట్లు పాకిస్తాన్‌ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో టర్కీ షాక్‌ ఇచ్చింది.

సైనిక సహాయం కోసం..
పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఒప్పందం మొదట బంగ్లాదేశ్‌తో కలిపి ఊహించబడింది. తర్వాత ఈ మూడు దేశాలకు మారింది. ఆయుధాల సరఫరా ఆధారంగా ఏర్పడింది. సౌదీ అరేబియా పాకిస్తాన్‌పై ఆధారపడి, అవసర సైనిక సహాయం కోరుతోంది.

సౌదీ అవసరాలు..
యూఏఈ, హూతీల మధ్య ఘర్షణల నేపథ్యంలో సౌదీ అరేబియాకు అదనపు సైన్యం అవసరం. పాకిస్తాన్‌ నుంచి అద్దె స్థాయిలో సైనికులను తీసుకురావాలని భావిస్తోంది. ఈ సందర్భంలో టర్కీతో ఆయుధాల ఒప్పందం ఏర్పడింది.

ఆయుధ విక్రయం మాత్రమే
టర్కీ తాజా ప్రకటనలో ఈ ఒప్పందం ఆయుధాల అమ్మకానికి మాత్రమేనని స్పష్టం చేసింది. పాక్, సౌదీకి సామర్థ్యం ఆధారంగా ఆయుధాలు సరఫరా చేస్తామని తెలిపింది. నాటో లేదా సైనిక అలయన్స్‌ రకం కాదని స్పష్టం చేసింది. తాము యూరోపియన్‌ యూనియన్‌లో ఉన్నామని వెల్లడించింది.

సౌదీ అవసరాలకు పాక్‌ సైనిక మద్దతు, టర్కీ ఆయుధాలు అందించడం వ్యాపార లాభాలకు మార్గం. ఇది సైనిక కూటమి కాకుండా ఆర్థిక–సాంకేతిక సహకారంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular