Kalki 2: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా ‘కల్కి 2’ సినిమాని చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కల్కి సినిమాలో ప్రెగ్నెంట్ గా కనిపించిన దీపిక పదుకొనే చాలా బాగా నటించింది. ఇక కల్కి 2 కి వచ్చేసరికి మాత్రం ఆమె పెట్టే కండిషన్స్ చాలా దారుణంగా ఉండడంతో మేకర్స్ ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు. ఇక ఆమె ప్లేస్ లో ఏ హీరోని తీసుకుంటున్నారనే చర్చ గత కొన్ని నెలల నుంచి నడుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది… ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ని ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా దీపికా పదుకొనే క్యారెక్టర్ కి తను అయితే బాగా సెట్ అవుతుందని ప్రభాస్ చెప్పారట. అందువల్లే ఆమెను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది ఆ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆమెకు పాన్ ఇండియా మార్కెట్ కూడా ఏర్పడుతుంది.
కాబట్టి ఆమైతేనే ఈ సినిమాకి న్యాయం జరుగుతుందని ప్రభాస్ చెప్పడంతో బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా వర్కౌట్ అవుతుందని మేకర్స్ అయితే అదే నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇక ఆమెకు రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీపిక తో పోలిస్తే సాయి పల్లవి పెట్టే కండిషన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి ఈజీగా తనను హ్యాండిల్ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు…
ఇక మొత్తానికైతే ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమా లను చేస్తున్నాడు. ఈ ఫౌజీ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కి సిద్ధమవుతుండడం విశేషం…