Homeఅంతర్జాతీయంUS Federal Court Decision H1B Charges: లక్ష డాలర్ల ఫీజు.. తలబొప్పి కట్టింది.. ఇక...

US Federal Court Decision H1B Charges: లక్ష డాలర్ల ఫీజు.. తలబొప్పి కట్టింది.. ఇక జన్మలో హెచ్1బీ ఊసు ట్రంప్ ఎత్తడు.. ఎత్తలేడు..

US Federal Court Decision H1B Charges: దెబ్బ మీద దెబ్బ.. ఇది మామూలు దిబ్బ కాదు. ట్రంప్ దిమ్మ తిరిగిపోయే దెబ్బ. కాళ్ళ కింద భూమి కంపించి పోయే దెబ్బ. ఇక జన్మలో ఆ మాట కూడా ఎత్తడానికి కూడా భయపడే దెబ్బ.. అమెరికాలో ఏకచత్రాధిపత్యంగా.. మూర్ఖుడి మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ కు అక్కడి కోర్టు తిరుగులేని తీర్పు ఇచ్చింది. ఇకపై జన్మలో ఆ ఊసు ఎత్తడానికి కూడా వణుకు పుట్టేలా చేసింది. ట్రంప్ […]

US Federal Court Decision H1B Charges: దెబ్బ మీద దెబ్బ.. ఇది మామూలు దిబ్బ కాదు. ట్రంప్ దిమ్మ తిరిగిపోయే దెబ్బ. కాళ్ళ కింద భూమి కంపించి పోయే దెబ్బ. ఇక జన్మలో ఆ మాట కూడా ఎత్తడానికి కూడా భయపడే దెబ్బ.. అమెరికాలో ఏకచత్రాధిపత్యంగా.. మూర్ఖుడి మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ కు అక్కడి కోర్టు తిరుగులేని తీర్పు ఇచ్చింది. ఇకపై జన్మలో ఆ ఊసు ఎత్తడానికి కూడా వణుకు పుట్టేలా చేసింది.

ట్రంప్ తన పరిపాలన నిర్లక్ష్యాన్ని ప్రపంచ మీద రుద్దడానికి రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నాడు. ప్రపంచ దేశాల మీద అనవసరమైన సుంకాలు విధించడం.. ఇంకా లేనిపోని షరతులు విధించడం.. యుద్ధాలు చేయడం.. ఇలాంటి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే. ట్రంప్ తీసుకున్న మరో దారుణమైన నిర్ణయం అమెరికా కంపెనీలకు కోలుకోలేని ఇబ్బందిగా మారింది. అమెరికా యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశం లో భాగంగా.. అమెరికన్ కంపెనీల పై ట్రంప్ ప్రత్యేకమైన రుసుము వసూలు చేస్తామని ప్రకటించారు.. ప్రత్యేకమైన నైపుణ్యాల కోసం విదేశీ కార్మికులను నియమించుకునే యాజమాన్యాలు లక్ష డాలర్లు రుసుము చెల్లించాలని ట్రంప్ ఒక పనికిమాలిన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

ట్రంప్ తీసుకొని నిర్ణయం పట్ల అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదం తెలపలేదు. దీనిని చట్ట విరుద్ధమైన పన్ను అని బోస్టన్ ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. విదేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణులకు హెచ్ 1 బీ వీసాలు ఇవ్వడానికి లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం ఏంటని కోర్టు మండిపడింది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం చల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియోసోరోకిన్ సోమవారం అత్యంత చారిత్రాత్మకమైన తీర్పు చెప్పారు.. గత ఏడాది సెప్టెంబర్ లో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలలో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా ఆయన హెచ్1బికి ఎంపికైన వారు లక్ష డాలర్ల ఫీల్ చెల్లించాలని ఒక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీనిని దాదాపు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్ తీవ్రంగా తప్పుపట్టారు. అదే కాదు పోస్ట్ అని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని జడ్జి విచారించారు. లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం ఏంటని మండిపడ్డారు..

“అది పెనాల్టీ ఎలా అవుతుంది. అలా తీసుకోవడానికి మీరెవరు. అటువంటి విధానం అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఎలా సాధ్యమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని”కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. “కళాశాలలు.. ఆస్పత్రులు.. వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులను నియమించుకోవడానికి మా సామర్థ్యానికి మించి లక్ష డాలర్ల రుసుము చెల్లించాలంటే ఇబ్బందిగా ఉండేదని” ఆయా రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కోర్టు తీవ్రంగా పరిగణించి.. ట్రంప్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇక జన్మలో లక్ష డాలర్ల రుసుము వసూలు చేయాలనే ఆలోచన ట్రంప్ మదిలో ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper