Texas Floods: అమెరికా.. అగ్రరాజ్యం.. కానీ వరుస ప్రకృతి విళయాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు భూకంపాలు.. ఇంకోవైపు నుంచి తుపాన్లు.. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతున్న వైపరీత్యాలతో అమెరికన్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా తుపాన్ అమెరికాను ముంచెత్తింది. ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం కూడా జరిగింది.
అమెరికా ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన విపత్తుల్లో
టెక్సాస్ రాష్ట్రం ఇటీవలి వరదలు ఒకటి. ఈ వరదల్లో 50 మందికి పైగా మరణించగా, డజన్ల మంది గల్లంతయ్యారు. వీరిలో 20 మందికి పైగా పిల్లలు ఉన్నారు. అధికారిక వర్గాల ప్రకారం, ఇప్పటివరకు 850 మందిని రక్షించారు. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టెక్సాస్‌లోని హిల్ కంట్రీ ప్రాంతంలో గ్వాడలూప్ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ విపత్తు సంభవించింది. రాత్రిపూట 5 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నదిలో నీటిమట్టం 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగింది, ఇది 1987లోని వరదలను మించినస్థాయి. ఈ ఆకస్మిక ఉప్పెన కారణంగా అనేక గృహాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కెర్ కౌంటీలోని క్యాంప్ మిస్టిక్ వంటి సమ్మర్ క్యాంపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
వేగంగా రక్షణ చర్యలు..
గ్వాడలూప్ నది ఒడ్డున ఉన్న క్యాంప్ మిస్టిక్ వంటి సమ్మర్ క్యాంపులలో 750 మంది బాలికలు ఉండగా, 27 మంది వరదలో గల్లంతయ్యారు. హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకారం, 850 మందికి పైగా రక్షించారు. వీరిలో 223 మందిని øస్ట్ గార్డ్ రక్షించింది. అయితే, కొట్టుకుపోయిన వారిలో 15 మంది పిల్లలు ఉన్నారని, 12 మంది పెద్దలు, 5 మంది పిల్లల గుర్తింపు ఇంకా జరగలేదని అధికారులు తెలిపారు.
స్పందించిన ట్రంప్..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విపత్తుపై స్పందించారు. ‘‘షాకింగ్’’, ‘‘విషాదకరం’’గా అభివర్ణించారు. రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం ప్రకారం, ట్రంప్ గవర్నర్ అబాట్ సమాఖ్య విపత్తు డిక్లరేషన్ అభ్యర్థనను ఆమోదిస్తారని, యూఎస్ కోస్ట్ గార్డ్, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సహాయం అందిస్తున్నాయని తెలిపారు. అయితే, నేషనల్ వెదర్ సర్వీస్ సూచనలు సరిగ్గా లేకపోవడం, ట్రంప్ పరిపాలన సమయంలో సిబ్బంది కోతలపై విమర్శలు వెల్లువెత్తాయి.
అంచనాలో విఫలం..
జూలై 3న మధ్యాహ్నం ఫ్లడ్ వాచ్ జారీ చేసినప్పటికీ, వరదల తీవ్రతను ఊహించలేకపోయిందని అధికారులు తెలిపారు. కెర్ కౌంటీ జడ్జ్ రాబ్ కెల్లీ ప్రకారం, ఈ స్థాయి వరదలను ఊహించడం సాధ్యం కాలేదని, ఎందుకంటే గ్వాడలూప్ నదిపై హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో లేవని చెప్పారు.
अमरीका के टेक्सस में भीषण बाढ़ में 13 से 15 लोगों की मौत हो गई।
केर काउंटी के कैंप मिस्टिक में लगभग 20 बच्चों सहित कई लोग अब भी लापता हैं।
टेक्सस के उपराज्यपाल डेन पैट्रिक ने प्रेस कॉनफ्रेंस में कहा कि 45 मिनट के भीतर ग्वाडालूप नदी का जलस्तर अचानक 26 फीट तक जा पहुंचा।… pic.twitter.com/QjiZMAY2Db
— Sahil Shrivastava (@Sahil280100) July 5, 2025