Indian AI Entrepreneur: టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. స్పష్టమైన లక్ష్యం.. సాధించాలన్న తపన.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ గైడ్ చేసేవారు ఉంటే.. ఎంతటి కష్టమైన పని అనా సాధించగలం. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా ఓ యువకుడి అసంతృప్తి నుంచి ఆవిష్కరణవైపు పయనించాడు. కృషి, పట్టుదలతో కేవలం 31 ఏళ్లకే లక్షన్నర కోట్ల రూపాయల సంస్థకు అధిపతి అయ్యాడు.
అరవింద్ శ్రీనివాస్, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో ఒక సెచ్చ్ ఇంజిన్ సంస్థ ‘పర్‌ప్లెక్సిటీ’ని స్థాపించిన యువ భారతీయుడు. ఈ సంస్థ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలతో పోటీపడుతూ, కేవలం మూడేళ్లలో లక్షన్నర కోట్ల సంస్థగా ఎదిగింది. అరవింద్‌ను ఈ స్థాయికి చేర్చింది అతని అసంతృపిఇ్త. పట్టుదల, సమస్యలను అవకాశాలుగా మలచుకునే విజన్ అరవింద్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరణవైపు నడిపించాయి.
Also Read: 1% మంది వద్ద ఏకంగా 40 % సంపద.. బ్రిటీష్ కాలం కంటే ఇప్పుడే ఘోరం
అమ్మ కల నుంచి ఐఐటీ వరకు
అరవింద్ శ్రీనివాస్ చెన్నైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తల్లి ఆశయం తన కొడుకు ఐఐటీ–మద్రాస్‌లో చదవాలని. ఆమె ఆశయం అతనిలో ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని నాటింది, అతని జీవితంలో పెద్ద మలుపు తెచ్చింది. ఆమె పదే పదే చెప్పిన మాటలు అరవింద్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఐఐటీలో సీటు సాధించినప్పటికీ, అతని ఇష్టమైన కంప్యూటర్ సైన్స్‌కు బదులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. ఈ నిరాశ, రెండేళ్ల డిప్రెషన్‌కు దారితీసినా, అతను తన లక్ష్యాన్ని వదులుకోలేదు. రాత్రిపూట మెఫీన్‌లెర్నింగ్ కోర్సులు చదువుతూ, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో స్నేహం చేస్తూ, అరవింద్ తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. ఈ పట్టుదలే అతన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ వైపు నడిపించింది.
ఆ లోపాలను అవకాశంగా మలచుకుని..
అరవింద్‌కు ఏఐ సెర్చ్ ఇంజన్లలోని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అవి నిర్దిష్ట సమయం వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే అందించగలవు, రియల్–టైమ్ సమాచారం లేదా జవాబుల వెనుక సోర్స్ గురించి స్పష్టత ఇవ్వలేవు. ఈ సమస్యలను పరిష్కరించాలనే అసంతృప్తి అతన్ని ‘పర్‌ప్లెక్సిటీ’ ఆలోచన వైపు నడిపించింది. 2022లో స్థాపించిన ఈ ఏఐ సెర్చ్ ఇంజన్, సంప్రదాయ సెర్చ్ ఇంజన్లలా లింకులు ఇవ్వడం బదులు, నేరుగా జవాబులను అందిస్తుంది., వాటి సోర్స్‌ను స్పష్టంగా చూపిస్తుంది. ఈ రియల్–టైమ్ సమాచార సామర్థ్యం పర్‌ప్లెక్సిటీని ప్రత్యేకంగా నిలబెట్టింది.
Also Read: Nehal Modi Arrest: నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్.
యూనికార్న్‌గా ఎదుగుదల
పర్‌ప్లెక్సిటీ మూడేళ్లలో రెండు కోట్ల మంది యూజర్లను సంపాదించి, జెఫ్ బెజోస్, ఎన్విడియా వంటి పెట్టుబడిదారుల నుంచి కోట్లాది రూపాయల నిధులను ఆకర్షించింది. ఈ విజయం వెనుక అరవింద్ స్పష్టమైన దృష్టి, టెక్ దిగ్గజాలతో పోటీపడే ధైర్యం, వినూత్న ఆలోచనలు ఉన్నాయి. టైమ్ మ్యాగజైన్ అతన్ని ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ’లో ఒకరిగా ప్రకటించడం అతని ప్రభావానికి నిదర్శనం.
ఆ పుస్తకమే అతనికి స్ఫూర్తి..
అరవింద్ జీవితంలో గూగుల్ స్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ రాసిన ‘ఇన్ ది ప్లెక్స్’ పుస్తకం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ఈ పుస్తకం గూగుల్‌ను ఒక టెక్ దిగ్గజంగా తీర్చిదిద్దిన విధానాన్ని వివరిస్తుంది. అరవింద్ దీనిని తన జీవితంలో ఒక బైబిల్‌గా భావించాడు, ఇది అతని ఏఐ రంగంలో ఆవిష్కరణలకు దిశానిర్దేశం చేసింది.