Homeఅంతర్జాతీయంPakistan Airstrikes On Afghanistan Border: అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాకిస్తాన్‌.. టార్గెట్‌ వాళ్లే!

Pakistan Airstrikes On Afghanistan Border: అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాకిస్తాన్‌.. టార్గెట్‌ వాళ్లే!

Pakistan Airstrikes On Afghanistan Border: ఆఫ్గానిస్తాన్‌లో ఉంటూ.. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్నారంటూ తెహ్రీక్‌ ఎ తాలిబాద్‌ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు పాకిస్తాన్‌ తమ పొరుగు దేశమైన ఆఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న మట్టి ఇళ్లపై బాంబులు వేస్తోంది. ఫలితంగా ఆఫ్గానిస్తాన్‌లో సామాన్యులు చనిపోతున్నారు. మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉగ్రవాది కూడా మరణించలేదు. అయినా పాకిస్తాన్‌ తన దాడులు కొనసాగిస్తోంది. Also Read: టీమిండియా సెమీస్ […]

Pakistan Airstrikes On Afghanistan Border: ఆఫ్గానిస్తాన్‌లో ఉంటూ.. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్నారంటూ తెహ్రీక్‌ ఎ తాలిబాద్‌ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు పాకిస్తాన్‌ తమ పొరుగు దేశమైన ఆఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న మట్టి ఇళ్లపై బాంబులు వేస్తోంది. ఫలితంగా ఆఫ్గానిస్తాన్‌లో సామాన్యులు చనిపోతున్నారు. మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉగ్రవాది కూడా మరణించలేదు. అయినా పాకిస్తాన్‌ తన దాడులు కొనసాగిస్తోంది.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

ఆఫ్గానిస్తాన్‌ ప్రతిదాడులు..
పాకిస్తాన్‌ దాడులను తిప్పి కొట్టేందుకు తాలిబాన్‌ పాలకులు ప్రతిదాడులు ప్రారంబించారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గాన్‌ వైపు నుంచి వచ్చిన దాడులకు ప్రతిఘటనగా పాక్‌ సైన్యం ’గజబ్‌–లిల్‌–హక్‌’ అంటేనే భయంకర ప్రకోపం అనే పేరిట తీవ్ర చర్యలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ చుట్టూ లక్ష్యాలపై జరిపినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

సైనిక స్థావరాలు టార్గెట్‌చేసిన పాక్‌..
కాందహార్, పక్తియా ప్రాంతాల్లో ఉన్న సైనిక మౌలిక సదుపాయాలను పాక్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దాడిలో అనేక సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. తాలిబాన్‌ సంరక్షణలో ఉన్న టెర్రర్‌ నెట్‌వర్క్‌లు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులు సరిహద్దు భద్రతను పునరుద్ధరించే ప్రయత్నంగా పాక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాలిబాన్‌ ప్రభుత్వం పాక్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. ఇవే ఈ ప్రతీకార చర్యలకు దారితీశాయి. యుద్ధం కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారం ఆగిపోయింది, ప్రాంతీయ అస్థిరత పెరిగితే చైనా, రష్యా వంటి శక్తులు జోక్యం చేసుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper