Eng Vs Ind 2nd Test Day 5: ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. నాలుగు రోజులపాటు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఐదో రోజు ఆట తీరు సాగే విధానం పట్ల ఆసక్తి నెలకొంది. ఇంగ్లీష్ జట్టు ఎదుట భారత్ 600 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ దానిని సాధిస్తుందా? డ్రా వైపు వెళ్ళిపోతుందా? అనే ప్రశ్నలకు సమాధానం మరి కొద్ది గంటల్లో తేలనుంది.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
500 నుంచి 600 పరుగుల మధ్య టార్గెట్ ప్రత్యర్థి జట్ల ఎదుట ఉంచిన పది మ్యాచ్లలో 9 విజయాలను భారత్ సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ ను మాత్రమే డ్రా చేసుకుంది. కివీస్ జట్టుతో 2009లో జరిగిన మ్యాచ్లో 617 రన్స్ టార్గెట్ భారత్ విధించగా.. దానిని కివీస్ డ్రా గా ముగించింది. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ మైదానం పైన భారత్ 600కు నుంచి పరుగుల టార్గెట్ విధించింది. ఇక ఇప్పటికే మూడు కీలకమైన వికెట్లను భారత్ పడగొట్టింది. ఇక ఆదివారం నాడు జరిగే ఐదవ రోజు మ్యాచ్లో మిగతా 7 వికెట్లను పడగొడితే భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినట్టే. టే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ఉన్న బ్యాటర్లలో స్మిత్, బ్రూక్ అత్యంత కఠినమైన ఆటగాళ్లుగా పేరుపొందారు. ఇప్పటికే వీరు ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 300కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐదు వికెట్లు పడినప్పటికీ ఏమాత్రం భయపడకుండా భారత బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జోడి మరోసారి ఆ స్థాయిలో ఆడకుండా ఉండాలంటే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయాలి. ముఖ్యంగా సిరాజ్, ఆకాష్ అదరగొట్టాలి.. జడేజా, సుందర్ కూడా తమ వంతు పాత్ర పోషించాలి. ప్రసిధ్ దారుణంగా పరుగులు వేయకుండా పదునైన బంతులు వేయాలి.
ఇక ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు గతంలో 100 ఓవర్ లోనే 600కు పైగా పరుగులు చేసింది. అయితే ఆ పరుగులు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆ స్థాయిలో పరుగులు చేసినప్పుడు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో ఆ స్థాయిలో పరుగులు చేయడం సులభం. కానీ చేజింగ్లో అది కూడా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత అంత పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. పైగా భారత జట్టుపై విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ 536 రన్స్ చేయాలి. ఇక గతంలో 370కి పైగా పరుగుల లక్ష్యాలను ఇంగ్లాండ్ అత్యంత సులువుగా ఫినిష్ చేసింది. అయితే 600 పరుగుల లక్ష్యం ఉన్నప్పుడు మాత్రం ఇంగ్లాండ్ ఎక్కువగా ఓటములు ఎదుర్కొంది.. చివరికి బజ్ బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. 2024లో ఈ ఓటమిని ఇంగ్లాండ్ ఎదుర్కొంది.
1934లో కంగారు జట్టు ఇంగ్లాండ్ ముందు 708 రన్స్ టార్గెట్ విధించింది. ఓవల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది…
డర్బన్ లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎదుట సఫారీలు 696 రన్స్ టార్గెట్ విధించారు. 1939లో జరిగిన ఈ మ్యాచ్ ను ఇంగ్లాండ్ డ్రా చేసుకుంది.
1920లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో కంగారు జట్టు ఇంగ్లాండ్ ఎదుట 689 రన్స్ టార్గెట్ విధించింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఓడిపోయింది.
సిడ్నీ వేదికగా 1920లో కంగారు జట్టు 659 రన్స్ టార్గెట్ విధించింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది.
2024లో న్యూజిలాండ్ 658 రన్స్ టార్గెట్ విధిస్తే.. హామిల్టన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
2006లో బ్రిస్బెన్ వేదికగా జరిగిన మ్యాచ్లో కంగారు జట్టు 648 రన్స్ టార్గెట్ విధిస్తే.. దానిని చేజ్ చేయలేక ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది.
2019లో వెస్టిండీస్ జట్టు 628 రన్ టార్గెట్ విధించింది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది.
1924లో కంగారు జట్టు 605 రన్స్ టార్గెట్ విధించింది. సిడ్ని వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది.
1950లో వెస్టిండీస్ జట్టు 601 రన్స్ టార్గెట్ విధించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు తలవంచింది.