Lucky Bhaskar Sequel: గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar|). ‘సార్’ వంటి సూపర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ(Nagavamsi) నిర్మించాడు. థియేటర్స్ లో కంటే ఎక్కువగా ఈ చిత్రం ఓటీటీ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. సుమారుగా 15 వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ఈ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ‘సీతారామం’ చిత్రం తోనే బాగా దగ్గరయ్యాడు కానీ, ఈ సినిమాతో ఆయన మధ్య తరగతి కుటుంబాలకు బాగా దగ్గరయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ కి మలయాళం లో కంటే ఇప్పుడు తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ఉంది అనొచ్చు.
Also Read: అమెరికా గడ్డపై తెలుగువాళ్ళ గురించి గూస్ బంప్స్ స్పీచ్ ఇచ్చిన అల్లు అర్జున్!
అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు మంచి స్కోప్ ఉంది. విదేశాల్లో స్థిరపడిన లక్కీ భాస్కర్, ఆ తర్వాత అతను ఎంచుకున్న సరికొత్త మార్గం లో ఎలా నడిచాడు?, నిజాయితీగానే బ్రతుకుతాడా?, లేదా మళ్ళీ గ్యాంబ్లింగ్ చేస్తాడా వంటి అంశాలను సీక్వెల్ లో చూపించొచ్చు. మంచి ఎమోషన్ కి కూడా స్కోప్ ఉంది. రీసెంట్ గానే జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ టాక్ షో కి విచ్చేసిన వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ముందుగా వర్ష ప్రశ్న అడుగుతూ ‘సార్ చిత్రానికి సీక్వెల్ ఛాన్స్ ఉందా? ‘ అని అడగ్గా, దానికి వెంకీ సమాధానం చెప్తూ ‘సార్ కి లేదు..లక్కీ భాస్కర్ కి సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా రెడీ’ అని అన్నాడు.
#LuckyBaskhar will definitely have a sequel, says director #VenkyAtluri.
#LuckyBaskhar2 | #DulquerSalmaan pic.twitter.com/PhIyUtkKOa— 几丨ᐯ乇ᗪ (@realNiveD) July 5, 2025
మరి ఈ సీక్వెల్ లో కూడా దుల్కర్ సల్మాన్ నే హీరో గా ఉంటాడా?, లేకపోతే తెలుగు హీరోతో చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘అలాంటి ప్లాన్స్ ఏమి లేవు..దుల్కర్ గారితోనే ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ స్టార్ హీరో సూర్య తో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం విరామం లేకుండా షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోనుంది. ఇందులో సూర్య క్యారక్టర్ గజినీ సినిమాలో సంజయ్ రామస్వామి క్యారక్టర్ తరహాలో ఉంటుందట. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన సూర్య మార్కెట్ ఈ చిత్రం తో కం బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.